ఐసిసి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ కప్ మెగా టోర్నీలో టీమిండియాను టైటిల్ ఫేవరెట్ గా భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ అంచనాలకు తగ్గట్లుగా ఆడేందుకు ఇప్పటికే ఇంగ్లాండ్ కు చేరుకున్న భారత ఆటగాళ్లు తెగ కష్టపడిపోతున్నారు.  అయితే ఇలా  ఓవైపు ఆటగాళ్లు తెగ కష్టపడుతుంటే వారి సహాయంగా వుండాల్సిన చీఫ్ కోచ్ రవిశాస్త్రి మాత్రం వివాదంలో చిక్కుకున్నాడు. అతడు జట్టు సభ్యులకు దూరంగా వుంటూ సరదాగా గడపడానికే సమయాన్ని కేటాయిస్తున్నాడని అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

తాజాగా అతడు ఓ ఇద్దరు యువతులతో కలిసి దిగిన ఫోటో వైరల్ గా మారి వివాదానికి దారితీసింది. ఆ  అమ్మాయిలు ఎవరో తెలియకపోయినప్పటికి క్రికెట్ అభిమానులు, నెటిజన్లు ఆ ఫోటోపై వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఇక ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ డెన్నిస్ ఫ్రీడ‌మాన్ అయితే ఈ ఫోటోపై మరింత  వ్యంగ్యంగా స్పందించాడు. ఈ పోటోను ఉద్దేశించి అతడు ఈ విధంగా ట్వీట్ చేశాడు. '' టీమిండియా వరల్డ్ కప్ సన్నాహాలు చాలా బాగా సాగుతున్నట్లున్నాయి'' అంటూ ట్వీట్ తోనే చురకలంటించాడు. 

కేవలం అతడే కాదు టీమిండియా అభిమానులు, క్రికెట్ ప్రియులు రవిశాస్త్రిపై సోషల్ మీడియా ద్వారా  విరుచుకుపడుతున్నారు. '' ఇందుకోసమేనా అతడు టీమిండియా నిర్వహించిన అధికారిక ప్రెస్ మీట్ కు హాజరుకానిది'' అంటే ఓ నెటిజన్ సెటైరికల్ స్పందించాడు. ''  రవిశాస్త్రి షేన్ వార్న్ కంటే పెద్ద ప్లేబాయ్ లా ఉన్నట్టున్నాడే'' అంటూ మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇలా ప్రపంచ కప్ టోర్నీకోసం ఇంగ్లాండ్ కు వెళ్లిన రవిశాస్త్రి వివాదంలో చిక్కుకున్నాడు.