ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్  టోర్నీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై పాక్ అభిమానులు విచిత్రంగా స్పందిస్తున్నారు. గతంలో 1992 ప్రపంచ కప్ లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో పాక్ విజేతగా నిలిచిన రోజులను వారు గుర్తుచేసుకుంటున్నారు. సేమ్ టు సేమ్ అప్పటి పరిస్థితులనే పాకిస్థాన్ జట్టు  ఈ వరల్డ్ కప్ లోనూ ఎదుర్కుంటోంది... కాబట్టి ప్రపంచ కప్ తమదేనని జోస్యం చెబుతున్నారు. 

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు సంయుక్తంగా నిర్వహించిన 1992 ప్రపంచ కప్ ను కూడా పాకిస్థాన్ ఓటమితో ఆరంభించింది. ఈ టోర్నీలో పాక్ మొదట ఓటమి, ఆ తర్వాతి మ్యాచ్ లో గెలుపు, మూడోది రద్దు, నాలుగో మ్యాచ్ లో మళ్లీ  ఓటమిని చవిచూసింది. సేమ్ టు సేమ్ తాజా ఇంగ్లాండ్ లో జరుగుతున్న ఈ ప్రపంచ కప్ లో కూడా పాక్ మొదట వెస్టిండిస్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది.  ఆ తర్వాత సెకండ్ మ్యాచ్ లో ఆతిథ్య ఇంగ్లాండ్ పై అనూహ్య విజయాన్ని అందుకుంది. శ్రీలంకతో జరగాల్సిన మూడో మ్యాచ్ రద్దవగా నాలుగో దాంట్లో ఆసిస్ చేతిలో మళ్లీ ఓడిపోయింది. 

ఇలా 1992 ప్రపంచ కప్ లో పాక్ పరిస్థితిని...ప్రస్తుత వరల్డ్ కప్ లో పరిస్థిని పోలుస్తూ పాక్ దే విజయమని కొందరు అభిమానులు తేల్చేస్తున్నారు. అయితే ఈ  లెక్కన 1992  లో టీమిండియా చేతిలో  పాక్ ఘోర ఓటమిని చవిచూసింది. కాబట్టి ఈ వరల్డ్ కప్ లో కూడా పాక్ ఓడిపోతేనే వారి సెంటిమెంట్ ఫలించేది. కాబట్టి తమ జట్టు భారత్ చేతిలో ఓడిపోతే పరువు పోతుంది... గెలిస్తే సెంటిమెంట్ బ్రేక్ అవుతుంది. కాబట్టి ఇండో పాక్ మ్యాచ్ పై వారెలా స్పందిస్తారో చూడాలి మరీ. 

జూన్ 16వ తేదీన అంటే ఈ ఆదివారం మాంచెస్టర్ వేదికన దాయాది దేశాలు తలపడనున్నాయి. ఇప్పటికే ఈ ఇండో పాక్ మ్యాచ్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎ ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాల  మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్ ఫలితం ఎలా వుంటుందో చూడాలి మరి.