Asianet News TeluguAsianet News Telugu

భారత్ పై విజయమే కాదు... ఆ కోరిక ఇప్పట్లో నెరవేరేలా లేదు...: పాక్ మంత్రి

టీమిండియా ను ప్రపంచ కప్ టోర్నీలో ఓడించాలన్నది పాకిస్థాన్ కు తీరని కోరికలా మిగిలిపోతోంది.  భారత్ ను ఓడించాలని ఎన్నో ఆశలతో ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగుతున్న పాక్ కు ప్రతిసారి నిరాశే  ఎదురవుతోంది. వన్డే ప్రపంచ కప్ ను ఐసిసి  ప్రారంభించినప్పటి నుండి ఇప్పటివరకు పాక్ ఒక్కసారి కూడా భారత్ ను ఓడించలేకపోయింది. ఇలా ఇప్పటివరకు ఇండో పాక్ ల మద్య ఏడు మ్యాచ్ లు జరగ్గా అన్నిట్లోనూ పాక్ ఓటమిని చవిచూసింది. ఇటీవల మాంచెస్టర్ వేదికగా దాయాదుల మధ్య జరిగిన మ్యాచ్ లో పాక్ కు ఓటమి తప్పలేదు. 

world cup 2019: pak minister comments about indo pak match
Author
Manchester, First Published Jun 19, 2019, 5:25 PM IST

టీమిండియా ను ప్రపంచ కప్ టోర్నీలో ఓడించాలన్నది పాకిస్థాన్ కు తీరని కోరికలా మిగిలిపోతోంది.  భారత్ ను ఓడించాలని ఎన్నో ఆశలతో ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగుతున్న పాక్ కు ప్రతిసారి నిరాశే  ఎదురవు తోంది. వన్డే ప్రపంచ కప్  ను ఐసిసి ఆరంభించినప్పటి  నుండి ఇప్పటివరకు పాక్ ఒక్కసారి కూడా భారత్ ను ఓడించలేకపోయింది. ఇలా ఇప్పటివరకు ఇండో పాక్ ల మద్య ఏడు మ్యాచ్ లు జరగ్గా అన్నిట్లోనూ పాక్ ఓటమిని చవిచూసింది. ఇటీవల మాంచెస్టర్ వేదికగా దాయాదుల మధ్య జరిగిన మ్యాచ్ లో పాక్ కు ఓటమి తప్పలేదు. 

అయితే ఈ ప్రపంచ కప్ టోర్నీలనే ఇండో పాక్ మ్యాచ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది.  ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించడానికి మాంచెస్టర్ స్టేడియానికి   పాక్ విదేశాంగ మంత్రి మహ్మద్ ఖురేషీ విచ్చేశారు. అయితే తమ జట్టు చెత్త ప్రదర్శనతో  టీమిండియా చేతిలో ఓడిపోవడాన్ని అభిమానులతో పాటే అతడు కూడా జీర్ణించుకోలేకపోయాడు. దీంతో సొంత  జట్టు, ఆటగాళ్లపై సున్నితంగా విమర్శలు చేశారు. 

అయితే దాయాది జట్ల మధ్య మ్యాచ్ అంటే అభిమానులు చాలా ఇష్టపడతారని అన్నారు. కానీ ఇరుదేశాల మధ్య రాజకీయ కారణాలతో ద్వైపాక్షిక సీరిస్ లు జరక్కపోవడం చాలా దురదృష్టకరమని పేర్కొన్నారు. తమకు భారత్ తో ఆడేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ భారత్ మాత్రం అకారణంగా పాక్ తో ఆడటాన్ని వ్యతిరేకిస్తోందని  ఆరోపించారు. 

ఇలా ప్రపంచ కప్ లో బారత్ పై పాక్ గెలవాలన్న కోరికే కాదు ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సీరిస్ లు జరగాలన్ని కోరిక ఇప్పట్లో నెరవేరేలా కనిపించడం లేదని నిట్టూర్చారు. అయితే ఇరే దేశాల మధ్య  క్రికెట్ సంబంధాలు బాగుపడితే మాకే కాదు భారత్ కు కూడా లాభమేనని... భావితరాల్లో క్రికెట్ పై మరింత ఆసక్తి పెరుగుతుందని  ఖురేషి అభిప్రాయపడ్డారు. 

Follow Us:
Download App:
  • android
  • ios