Asianet News TeluguAsianet News Telugu

విండీస్ చేతిలో పరాభవం, ఇంగ్లాండ్ పై ఘన విజయం...ఎలా సాధ్యమంటే: పాక్ కోచ్

ప్రపంచ కప్ టోర్నీలో ఇప్పటివరకైతే అందరిని అత్యంత ఆశ్యర్యానికి  గురిచేసిన ఫలితం...ఇంగ్లాండ్ పై పాక్ గెలుపు. ఈ టోర్నీకి ముందు ఇదే ఇంగ్లాండ్ పై పాక్ ఐదు వన్డేల సీరిస్ లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక సీరిస్ కోల్పోయింది. ఆ తర్వాత ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్ లో పసికూన అప్ఘాన్ చేతిలో ఓడిపోయింది. ఇక మెయిన్ టోర్నీలో కూడా వెస్టిండిస్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసి సొంత అభిమానుల నుండే పెద్దఎత్తున విమర్శలు ఎదుర్కొంది. ఇలా ఆసాంతం ఓటములను ఎదుర్కొన్న పాక్ ఒక్కసారిగా ఇంగ్లాండ్ పై ఘనవిజయం సాధించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఆ విజయానికి, అంతకు ముందు ఓటములకు గల కారణాలను పాక్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ వెల్లడించాడు. 

world cup 2019:pak chief coach comments about pak victory
Author
Bristol, First Published Jun 7, 2019, 6:39 PM IST

ప్రపంచ కప్ టోర్నీలో ఇప్పటివరకైతే అందరిని అత్యంత ఆశ్యర్యానికి  గురిచేసిన ఫలితం...ఇంగ్లాండ్ పై పాక్ గెలుపు. ఈ టోర్నీకి ముందు ఇదే ఇంగ్లాండ్ పై పాక్ ఐదు వన్డేల సీరిస్ లో ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక సీరిస్ కోల్పోయింది. ఆ తర్వాత ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్ లో పసికూన అప్ఘాన్ చేతిలో ఓడిపోయింది. ఇక మెయిన్ టోర్నీలో కూడా వెస్టిండిస్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసి సొంత అభిమానుల నుండే పెద్దఎత్తున విమర్శలు ఎదుర్కొంది. ఇలా ఆసాంతం ఓటములను ఎదుర్కొన్న పాక్ ఒక్కసారిగా ఇంగ్లాండ్ పై ఘనవిజయం సాధించి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఆ విజయానికి, అంతకు ముందు ఓటములకు గల కారణాలను పాక్ కోచ్ గ్రాంట్ ఫ్లవర్ వెల్లడించాడు. 

శ్రీలంకతో మ్యాచ్ కు ముందు ఫ్లవర్ మీడియాతో మాట్లాడుతూ...'' ఇంగ్లాండ్ పై విజయంతో తమ ఆటగాళ్లలో అత్మవిశ్వాసం మరింత పెరిగింది. అంతకుముందు ఈ ఆత్మవిశ్వాసం లేకే పాక్  ఓటమిపాలవ్వాల్సి వచ్చింది. అంతేకాకుండా ఇక్కడి పరిస్థితులకు అలవాటు పడేలోపే ఆ మ్యాచుల్లో తలపడాల్సి వచ్చింది. అందువల్లే వార్మప్ లో అప్ఘాన్, మొదటి మ్యాచ్ లో వెస్టిండిస్ చేతిలో ఓడిపోయాం.  

కానీ ఆ తర్వాత పాక్ ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడిలో కూడా పరిస్థితులకు అనుగుణంగా ఆడటం వల్లే  ఆతిథ్య ఇంగ్లాండ్ పై గెలిచింది.  వరుస ఓటముల తర్వాత గాడిలో పడ్డ పాక్ ఇదే ఊపును కొనసాగిస్తుందని  నమ్ముతున్నా. పాక్ ఈ ప్రపంచ కప్ టోర్నీలో ప్రధాన పోటీదారుగా మారనుంది. ఇంగ్లాండ్ పై 350 పరుగులు సాధించడం జట్టు సభ్యుల్లో మరింత  ఆత్మవిశ్వాసాన్ని పెంచింది.'' అని ఫ్లవర్ వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios