ప్రపంచ కప్ 2019 టోర్నీని పాక్ ఘోరమైన ఓటమితో ఆరంభించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో పాక్ ప్రపంచ కప్ చరిత్రలోనే రెండో అతి తక్కువ స్కోరు (105 పరుగులు) ను నమోదు చేసుకుని మరో చెత్త రికార్డను తన ఖాతాలో వేసుకుంది. అంతేకాకుడా పాక్ నిర్ధేశించిన 106 పరుగల విజయ లక్ష్యాన్ని విండీస్ కేవలం 13.4 ఓవర్లలోనే ఛేదించింది. ఇలా  దాదాపు మరో 36 ఓవర్లు మిగిలుండగానే విండీస్ ఘన విజయాన్ని, పాక్ ఘోర ఓటమిని అందుకుంది. దీంతో తన కెప్టెన్సీలో పాక్ చవిచూసిన ఈ వైఫల్యం తనకో పీడకలలా మిగిలిపోతుందని మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అన్నాడు. 

ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత సర్ఫరాజ్ మీడియాతో మాట్లాడుతూ... బ్యాట్ మెన్స్ విఫలమవ్వడం వల్లే తాము ఓడిపోయామన్నాడు. ప్రపంచ కప్ టోర్నీని విజయంతో ఆరంభించి ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని భావించామని...కానీ ఈ ఘోర ఓటమి తమను మరింత ఒత్తిడిలోకి నెట్టిందన్నాడు. అయితే ఎంత ఒత్తిడి వున్నా తదుపరి మ్యాచ్ లో తమ పూర్తి సత్తాను ఉపయోగించి గాడిలో పడతామన్ర నమ్మకం వుందని సర్ఫరాజ్ తెలిపాడు.

ఈ మ్యాచ్ మొత్తంలో తమకు కాస్త ఊరటనిచ్చే విషయం బౌలర్ అమీర్ ప్రదర్శన. అతడు ఈ మ్యాచ్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు పడగొట్టి ఫామ్ ను  అందిపుచ్చుకోవడం మంచి పరిణామమన్నాడు. మిగతా బౌలర్లు కూడా చాలా అద్బుతంగా బౌలింగ్ చేశారని...మిగతా మ్యాచుల్లో కూడా వారు ఇదే ఆటతీరును కనబర్చాలని కోరుకుంటున్నానని అన్నాడు. అమీర్ అనుభవంతో కూడిన టెక్నికల్ బౌలింగ్ పాక్ కు మరింత బలాన్నిస్తుందని సర్ఫరాజ్ వెల్లడించాడు.