Asianet News TeluguAsianet News Telugu

ఇండో పాక్ మ్యాచ్...వర్షం పడుతున్నా మ్యాచ్ జరుగుతుంది...ఎలాగంటే: షోయబ్ అక్తర్

ప్రపంచ కప్ లో భాగంగా ఆదివారం జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచివుందని ఇంగ్లాండ్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఈ టోర్నీలో చాలా మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దయ్యాయి. కానీ ఎన్నో రోజులుగా ఈ ఇండో పాక్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. అలాంటిది ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవుతుందన్న వార్తను వినడానికే వారు ఇష్టపడటం లేదు. ఎట్టిపరిస్థితుల్లో ఈ మ్యాచ్ జరిపి తీరాలంటూ తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా  వ్యక్తపరుస్తున్నారు. 
 
world cup 2019: pak bowler shoaib akhtar funny tweet on indo pak match
Author
Manchester, First Published Jun 15, 2019, 8:32 PM IST

ప్రపంచ కప్ లో భాగంగా ఆదివారం జరగనున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచివుందని ఇంగ్లాండ్ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఈ టోర్నీలో చాలా మ్యాచ్ లు వర్షం కారణంగా రద్దయ్యాయి. కానీ ఎన్నో రోజులుగా ఈ ఇండో పాక్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. అలాంటిది ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవుతుందన్న వార్తను వినడానికే వారు ఇష్టపడటం లేదు. ఎట్టిపరిస్థితుల్లో ఈ మ్యాచ్ జరిపి తీరాలంటూ తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా  వ్యక్తపరుస్తున్నారు. 

కేవలం అభిమానులే కాదు దాయాది దేశాల మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు కూడా ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలా ఇండోపాక్ మ్యాచ్ కోసం  పాక్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ కూడా ఎదురుచూస్తున్నాడు. అయితే వర్షం ఈ మ్యాచ్ కు అడ్డంకి సృష్టిస్తుందన్న సమాచారంపై అతడు కాస్త ఫన్నీ ట్వీట్ చేశాడు. ఇలా ఎంత కష్టమైనా సరే ఈ మ్యాచ్ జరిపి తీరాల్సిందేనని అతడు కూడా అభిమానులుకు సపోర్ట్ చేస్తూ ఓ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. 

ఈ పోటోలో మైదానంలో భారీగా నీరు నిలిచిపనట్లుగా చూపించాడు. అందులో టీమిండియా  కెప్టెన్ కోహ్లీ, పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ ఈదుతున్నట్లుగా చూపించాడు.  అంతేకాదు కామెంటేటర్లు ఓ పడవలో నిలబడి మాట్లాడుతున్నట్లుగా పోటోషాప్ ద్వారా ఓ ఫోటోను సృష్టించాడు. అయితే వర్షపు నీటితో మైదానం సముద్రంలా  మారిందని సూచించడానిక ఓ షార్క్ ను కూడా ఈ ఫోటోలో వుంది. ఇలా ప్రపంచ కప్ లో మ్యాచ్ లకు వర్షం అడ్డంకిగా  మారడం...ముఖ్యంగా ఇండో పాక్ మ్యాచ్ కు కూడా అడ్డంకిగా మారనుందన్న వార్త  నేపథ్యంలో తన అసహనాన్ని షోయబ్ ఇలా వ్యక్తపర్చాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios