Asianet News TeluguAsianet News Telugu

ఈసారి ప్రపంచ కప్ ట్రోపీ టీమిండియాదే: పాక్ ఆటగాడి సంచలన కామెంట్

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే ఈ  మెగా టోర్నీ ఆరంభం నుండి వరుస విజయాలను అందుకుంటూ సత్తా చాటుతోంది. ఇటీవల చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను కూడా మట్టికరిపించింది. అయితే ఈ ఓటమి తర్వాత పాక్ ఆటగాళ్లు మాజీలు, సొంత అభిమానుల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రపంచ కప్ టోర్నీని సాధించే సత్తా టీమిండియాకే వుందని...ఈసారి ఆ ట్రోఫీని ఎగరేసుకుపోవడం ఖాయమంటూ పాక్ బౌలర్ హసన్ అలీ సంచలన కామెంట్ చేశాడు.

world cup 2019: pak  bowler sensational comments
Author
London, First Published Jun 20, 2019, 11:33 PM IST

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచ కప్ టోర్నీలో టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే ఈ  మెగా టోర్నీ ఆరంభం నుండి వరుస విజయాలను అందుకుంటూ సత్తా చాటుతోంది. ఇటీవల చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను కూడా మట్టికరిపించింది. అయితే ఈ ఓటమి తర్వాత పాక్ ఆటగాళ్లు మాజీలు, సొంత అభిమానుల నుండి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రపంచ కప్ టోర్నీని సాధించే సత్తా టీమిండియాకే వుందని...ఈసారి ఆ ట్రోఫీని ఎగరేసుకుపోవడం ఖాయమంటూ పాక్ బౌలర్ హసన్ అలీ సంచలన కామెంట్ చేశాడు.

పాకిస్థాన్ గెలుపొందిన టీమిండియా ను ప్రశంసిస్తూ ముంతాజ్ ఖాన్ అనే మహిళా జర్నలిస్ట్ ఓ ట్వీట్ చేసింది. '' ఇప్పటివరకు టీమిండియా అందుకున్న విజయాల్లోకెల్ల ఇది చాలా గొప్ప విజయం. నిజంగా సంబరాలు చేసుకోవాల్సిన సమయమిది. తాను భారతీయురాలిగా ఈ విజయాన్ని  చూసి ఎంతో గర్వపడుతున్నా. ఇక ప్రపంచ కప్  ట్రోఫీని గెలుచుకోవడమే టీమిండియా  ముందున్న ఏకైక లక్ష్యం...అది నెరవేరాలని కోరుకుంటున్నా'' అని పేర్కొన్నారు. 

అయితే ఈ ట్వీట్ పై స్పందించిన పాక్ బౌలర్ హసన్ అలీ ఈ విధంగా కామెంట్ చేశాడు. '' టీమిండియా ప్రపంచ కప్ గెలుచుకోవాలన్న మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది'' అంటూ కామెంట్ చేశాడు. ఆ తర్వాత ఏమైదో గాని కొద్దిసేపటి తర్వాత ఆ కామెంట్ ను  డిలేట్ చేశాడు. అయినప్పటికి అప్పటికే అది సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిపోయింది. 
 
Follow Us:
Download App:
  • android
  • ios