మాంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్-వెస్టిండిస్ మధ్య జరిగిన పోరాటం రసవత్తరంగా సాగింది. చివరి వరకు విజయం ఇరు జట్లు మధ్య ఊగిసలాడుతూ చివరకు కివీస్ వైపే నిలిచింది. 292 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో మొదట్లొ ఓపెనర్ క్రిస్ గేల్( 87 పరుగులు), మధ్యలో హెట్మెయర్ (54 పరుగులు) మెరిశారు. ఇక చివర్లో బ్రాత్ వైట్ వీరోచితంగా పోరాడి అద్భుత సెంచరీ (82 బంతుల్లోనే 104 పరుగులు)తో ఓటమి అంచుల్లో నిలిచిన జట్టును దాదాపు విజయపుటంచుల వరకు తీసుకొచ్చాడు.  అయితే చివరి వికెట్ రూపంలో అతడు ఔటవడంతో వీండీస్ కేవలం 5 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యింది. 

కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు పడగొట్టాడు. ఇక ఫెర్గ్ సన్ 3, గ్రాండ్ హోమ్, నీషమ్, హెన్రీలు ఒక్కో వికెట్ పడగొట్టి విండీస్ ను  కుప్పకూల్చారు. దీంతో 49 ఓవర్లలోనే విండీస్ 286 పరుగులు చేసి ఆలౌటయ్యింది. 

 ఇద్దరు ఓపెనర్లు డకౌటయ్యారు. కేవలం ముగ్గురు బ్యాట్ మెన్స్ మాత్రమే 20 పైచిలుకు పరుగులు చేశారు. అయినా న్యూజిలాండ్ స్కోరు 291 కు చేరుకుందంటే అది కేవలం కెప్టెన్ విలియమ్సన్(148 పరుగులు) వీరోచిత సెంచరీ చలవే అని చెప్పాలి. అతడితో పాటు టేలర్ 69, నీషమ్ 28 పరుగులు చేశాడు.మిగతా వారెవ్వరు కనీస పరుగులు సాధించకున్నా కివీస్ 291 పరుగులు చేయ్యగలిగింది.

ఆరంభంలోనే  ఓపెనర్లిద్దరిని కోల్పోయిన కివీస్ జట్టును కెప్టెన్ విలియమ్సన్, టేలర్ లు ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి ఏకంగా 160 పరుగుల భాగస్వామ్యన్ని నెలకొల్పారు.ఈ క్రమంలో కెప్టెన్ విలియమ్సన్ సెంచరీని పూర్తిచేసుకోగా టేలర్ హాఫ్ సెంచరీని బాదాడు.అయితే 69 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టేలర్ గేల్ బౌలింగ్ లో ఔటయ్యాడు. దీంతో కివీస్ 167 పరుగుల వద్ద మూడో  వికెట్ కోల్పోయింది. విండీస్ బౌలర్లలో కోట్రెల్ 4 వికెట్లు పడగొట్టాడు. అలాగే బ్రాత్ వైట్  2,  క్రిస్ గేల్ 1 వికెట్ తీశారు. 

ప్రపంచ కప్ టోర్నీలో మరో రసవత్తర పోరుకు మాంచెస్టర్  ఓల్డ్ ట్రఫోర్డ్ స్టేడియంలో సిద్దమైంది. వరుస విజయాలతో దూసుకుపోతూ పాయింట్స్ టేబుల్ లో టాప్ ప్లేస్ ను ఆక్రమించిన న్యూజిలాండ్, బంగ్లాదేశ్ వంటి చిన్న టీం చేతిలో ఓడిపోయి వెస్టిండిస్ జట్లు ఈ  మ్యాచ్ లో తలపడనున్నాయి. ఈ  మ్యాచ్ కోసం చేపట్టిన టాస్ ను గెలుచుకున్న విండీస్ పీల్డింగ్ ఎంచుకుంది. దీంతో కివీస్ మొదట బ్యాటింగ్ కు దిగనుంది. 

తుది జట్లు:

న్యూజిలాండ్ టీం: 

మార్టిన్  గప్తిల్, కోలిన్ మన్రో, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, టామ్ లూథమ్(వికెట్ కీపర్), జేమ్స్ నీషమ్, కోలిన్ గ్రాండ్ హోమ, మిచెల్ సాట్నర్, హెన్రీ, ఫెర్గ్ సన్, ట్రెంట్ బౌల్ట్

విండీస్ టీం: 

క్రిస్ గేల్, ఎవిన్ లూయిస్, హోప్స్ (వికెట్ కీపర్), నికోలస్ పూరన్, హెట్మెయర్, జాసన్ హోల్డర్ (కెప్టెన్), కార్లోస్ బ్రాత్ వెట్, నర్స్, కీమర్ రోచ్, కోట్రెల్, థామస్