రోమ్ కు వెళితే రోమన్ మాదిరిగానే వుండాలనేది ఓ  ఇంగ్లీష్ సామెత సారాంశం. అలా కాకుండా నేను నాలాగే వుంటానే, ఎవరికోసమే నేను మారను అంటే నవ్వులపాలవ్వాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితినే పాకిస్థాన్ క్రికెట్ టీం కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ ఎదుర్కొంటున్నాడు. ప్రపంచ కప్ టోర్నీకి ప్రారంభానికి ముందు జరిగిన ఓ కార్యక్రమంలో అందరు కెప్టెన్లకు భిన్నంగా సర్ఫరాజ్ పాక్ డ్రెస్సింగ్ స్టైల్లో కనిపించాడు. అయితే అంతర్జాతీయ వేదికపై హుందాగా ప్రవర్తించకుండా సాంప్రదాయం పేరుతో అతడు చేసిన  పని క్రికెట్ అభిమానులు, నెటిజన్ల విమర్శలకు కారణమవుతోంది.  

ప్రపంచ కప్ కోసం ఇప్పటికే అంతర్జాతీయ జట్లన్ని ఇంగ్లాండ్ కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ మెగా టోర్నీ ఆరంభ వేడులకలను ఐసిసి అట్టహాసంగా నిర్వహించింది. అంతేకాకుండా తమ దేశం ఆతిథ్యమిస్తున్న ప్రపంచ కప్ టోర్నీలో పాల్గొనడానికి వచ్చిన అన్ని జట్ల కెప్టెన్లను ఇంగ్లాండ్ మహారాణి ఎలిజబెత్,యువరాజు హ్యారీ కలుసుకున్నారు. ఇలా రాయల్ ఫ్యామిలీ గడిపై అరుదైన అవకాశాన్ని కెప్టెన్లందరు పొందారు.

అయితే ఈ కార్యక్రమంలో అందరు సారథులు సూట్స్, టై తో హుందాగా వుండే డ్రెస్సింగ్ తో పాల్గొన్నారు. కానీ పాక్ కెప్టెన్ సర్పరాజ్ మాత్రం వారి దేశానికి సంబంధించిన కార్యక్రమమేదో జరిగినట్లు కమీజ్ వేసుకుని ఈ కార్యక్రమానికి వచ్చాడు. ఇంకా నయం దానిపై పాకిస్థాన్ జట్టును సూచించేలా ఓ బ్లెజర్ వేసుకున్నాడు. లేందంటే అంతర్జాతీయ వేదికపై ఈ విచిత్ర వేషధారణలో కనిపించి మరింత నవ్వులపాలయ్యేవాడు. 

సర్పరాజ్ డ్రెస్సింగ్ పై ప్రముఖ రచయిత, జర్నలిస్ట్ తారక్ ఫతా కూడా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. '' ప్రతి కెప్టెన్ ఇంగ్లాండ్ మహారాణిని కలవడానికి హుందాగా వుండే డ్రెస్సింగ్ స్టైల్లో వచ్చారు. కానీ ఒకే ఒక కెప్టెన్ మాత్రం వింత వేషధారణతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అతడు మరెవరో కాదు పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్. ఇంకా నయం అతడు పైజామాతో వచ్చాడు...లుంగీ,బనియన్, టోపీ ధరించి రాలేదు. '' అంటూ విమర్శించారు. 

Scroll to load tweet…

ఇక క్రికెట్ అభిమానులు, నెటిజన్లయితే సర్పరాజ్ డ్రెస్సింగ్ పై వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ''దేశ సాంస్కృతిని కాపాడానని సర్ఫరాజ్ అనుకుంటున్నాడామో... అంతర్జాతీయ వేధికపై పరువు తీశానని గుర్తించాలి'', '' పాకిస్థాన్ ఆటే కాదు డ్రెస్సింగ్ స్టైల్ కూడా చెత్తే'' అంటూ కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. మరికొందరేమో అతడిక దేశ సంస్కృతి, సాంప్రదాయాల పట్ల వున్న ప్రేమకు మెచ్చుకుంటున్నారు.