ఇంగ్లాండ్ వేదికన జరుగుతున్న ప్రపంచ కప్ సీజన్ 12లో టీమిండియాకు శుభారంభం లభించింది. మొదటి మ్యాచ్ లోనే దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత ఆటగాళ్లు ఘన విజయాన్ని అందించారు. అయితే విజయం అంత ఆషామాషీగా రాలేదని...ఇందులో చాలామంది కఠోర శ్రమ దాగుందని కెప్టెన్ విరాట్ కోహ్లీ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు. ముఖ్యంగా కొన్ని ప్రమాదకరమైన క్యాచులను సైతం తాము అందుకున్నామని...అలాంటి వాటిల్లో ఒకటి డికాక్ క్యాచ్ అని కోహ్లి పేర్కొన్నాడు. 

ఈ క్యాచ్ గురించి కోహ్లీ మాట్లాడుతూ..'' దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ ను ఔట్ చేయడానికి తాను అందుకున్న క్యాచ్ చాలా ప్రమాదకమైంది. అత్యంత వేగంగా వచ్చిన ఆ బంతిని అంతుకుని నేనే సాహసం  చేశానని చెప్పాలి. ఆ క్యాచ్ అందుకున్నాక దాదాపు 15 నిమిషాలపాటు నా చేతులు తిమ్మిరితో పనిచేయలేవు. అయినా అలాగే పీల్డింగ్ కొనసాగించాను. అదృష్టవశాత్తు ఆ సమయంలో నావైపుమ బంతి ఎక్కువగా రాలేదు'' అని వివరించాడు.

ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారని కోహ్లీ ప్రశంసించారు. ముఖ్యంగా బుమ్రా టీమిండియాకు అద్భుమైన ఆరంభాన్నిచ్చాడు. అతడు బంతులను ఎదుర్కోడానికి సఫారీ బ్యాట్ మెన్స్ చాలా కష్టపడాల్సి వచ్చింది. బుమ్రా బౌలింగ్ లో ఎలాంటి ఆటగాడైనా ఒత్తిడికి గురవుతాడని కోహ్లీ తెలిపాడు.  

ఇక స్పిన్ ద్వయం చాహల్, కుల్దీప్ లు మిడిల్ ఓవర్లలో మణికట్టు మాయాజాలాన్ని ప్రదర్శించారు. చాహల్ అయితే ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. రోహిత్ శర్మ, ధోని చివర్లో పాండ్యా మెరుపులతో భారత జట్టుకు విజయాన్ని అందించారని కోహ్లీ పేర్కొన్నాడు.