Asianet News TeluguAsianet News Telugu

రోహిత్ బ్యాటింగ్ స్టైల్ పై కెఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఈ  ప్రపంచ కప్ టోర్నీలో వరుస సెంచరీలతో అదరగొడుతున్న విషయం తెలిసిందే. ప్రత్యర్థి బౌలర్లు కేవలం హాఫ్ సెంచరీ  చేసే అవకాశమిస్తే చాలు దాన్ని భారీ స్కోరుగా ఎలా మలచాలో అతడికి బాగా తెలుసు. ఇలా సెంచరీలే కాదు అదే ఊపులో డబుల్ సెంచరీలు చేసి రికార్డులు సృష్టించిన సందర్భాలు కూడా వున్నాయి. అయితే ఈ మెగా టోర్నీలో రోహిత్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న యువ ఓపెనర్ కెఎల్ రాహుల్ భారీ పరుగులు చేయడంలో విఫలమవుతున్నాడు. దీనిపై ఓ మీడియా ప్రతినిధి రాహుల్ తో మాట్లాడుతూ...రోహిత్ బ్యాటింగ్ ను ఫాలో అయితే భారీ స్కోర్లు చేయగలవంటూ సలహా ఇచ్చాడు. అయితే ఈ సలహాను నేనే కాదు ఎవరు పాటించినా వాళ్లంత మూర్ఖులు మరెవరు వుండరంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

world cup  2019: kl rahul comments about rohit sharma batting style
Author
Birmingham, First Published Jul 4, 2019, 4:23 PM IST

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఈ  ప్రపంచ కప్ టోర్నీలో వరుస సెంచరీలతో అదరగొడుతున్న విషయం తెలిసిందే. ప్రత్యర్థి బౌలర్లు కేవలం హాఫ్ సెంచరీ  చేసే అవకాశమిస్తే చాలు దాన్ని భారీ స్కోరుగా ఎలా మలచాలో అతడికి బాగా తెలుసు. ఇలా సెంచరీలే కాదు అదే ఊపులో డబుల్ సెంచరీలు చేసి రికార్డులు సృష్టించిన సందర్భాలు కూడా వున్నాయి. అయితే ఈ మెగా టోర్నీలో రోహిత్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభిస్తున్న యువ ఓపెనర్ కెఎల్ రాహుల్ భారీ పరుగులు చేయడంలో విఫలమవుతున్నాడు. దీనిపై ఓ మీడియా ప్రతినిధి రాహుల్ తో మాట్లాడుతూ...రోహిత్ బ్యాటింగ్ ను ఫాలో అయితే భారీ స్కోర్లు చేయగలవంటూ సలహా ఇచ్చాడు. అయితే ఈ సలహాను నేనే కాదు ఎవరు పాటించినా వాళ్లంత మూర్ఖులు మరెవరు వుండరంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

''రోహిత్ శర్మ ప్రత్యేకమైన బ్యాటింగ్ శైలి కలిగిన ఆటగాడు. అతడి మార్క్ షాట్లు ఆడటం ఇంకెవ్వరికి సాధ్యం కాదు. ముఖ్యంగా అతడు బంతిని బౌండరీకి తరలించే షాట్లలో చాలా ఖచ్చితత్వం, వైవిధ్యం వుంటుంది. హిట్ మ్యాన్ అన్న నిక్‌నేమ్ అతడికి సరిగ్గా సరిపోతుంది. ఇతర గ్రహం నుండి వచ్చిన అతీతమైన శక్తులు ఆడినట్లుగా రోహిత్ ఆటతీరు వుంటుంది. దాన్ని నేనే కాదు ఇంకెవ్వరు అనుసరించలేరు. అలా చేస్తే వాళ్లంత మూర్ఖులు మరెవరు వుండరు'' అని రాహుల్ వెల్లడించాడు.

అయితే ఓ వైపు రోహిత్ భారీ స్కోర్లు  సాధిస్తుంటే అతడి ముందు నేను తేలిపోతుంటే కాస్త బాధగా వుందన్నాడు. చాలా మ్యాచుల్లో హాఫ్ సెంచరీలను అలవోకగా బాదుతున్న తాను వాటిని సెంచరీలుగా మలచడంలో విఫలమవుతున్నా.  ఈ సమస్యను అదిగమించడానికి ఇప్పటికే సహచరులు, కోచ్ లతో చర్చించినట్లు తెలిపాడు. అయితే వారంతా కేవలం సలహాలు, సూచనలు మాత్రమే ఇవ్వగలరని...కానీ ఈ సమస్యను అధిగమించాల్సింది మాత్రం తానేనని అన్నాడు. కాబట్టి  భారీ  స్కోర్లు సాధించే ఉపాయాన్ని కనుక్కోడానికి ప్రయత్నిస్తున్నట్లు రాహుల్ వెల్లడించాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios