Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచ కప్ 2019: ఆదర్శ అభిమానం... ఇండో పాక్ నరిహద్దులను చెరిపేసిన భార్యాభర్తలు

ఆమె ఇండియన్...అతడు పాకిస్థాని. వీరిద్దరు పుట్టిన దేశాల మధ్య రోజురోజుకు శతృత్వం పెరుగుతుంటే వీరి మధ్య మాత్రం ప్రేమ చిగురించింది. ఇలా సరిహద్దులను లెక్కచేయకుండా వీరి ప్రేమ సాగింది. కులాలు ఒక్కటే కావడంతో పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఇలా గతంలో సరిహద్దులను చెరిపేస్తూ ఒక్కటైన ఆ జంట తాజాగా మరోసారి అలాంటి ప్రయత్నమే చేశారు.  ప్రపంచ కప్  టోర్నీలో భాగంగా నిన్న(ఆదివారం) జరిగిన ఇండో పాక్ మ్యాచ్ కు ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిన ఈ జంట దాయాది దేశాలకు సమానంగా మద్దతు ప్రకటిస్తూ  ఆదర్శ అభిమానులుగా నిలిచారు. 

world cup 2019:indo pak super fans
Author
Manchester, First Published Jun 17, 2019, 3:50 PM IST

ఆమె ఇండియన్...అతడు పాకిస్థాని. వీరిద్దరు పుట్టిన దేశాల మధ్య రోజురోజుకు శతృత్వం పెరుగుతుంటే వీరి మధ్య మాత్రం ప్రేమ చిగురించింది. ఇలా సరిహద్దులను లెక్కచేయకుండా వీరి ప్రేమ సాగింది. కులాలు ఒక్కటే కావడంతో పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఇలా గతంలో సరిహద్దులను చెరిపేస్తూ ఒక్కటైన ఆ జంట తాజాగా మరోసారి అలాంటి ప్రయత్నమే చేశారు.  ప్రపంచ కప్  టోర్నీలో భాగంగా నిన్న(ఆదివారం) జరిగిన ఇండో పాక్ మ్యాచ్ కు ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిన ఈ జంట దాయాది దేశాలకు సమానంగా మద్దతు ప్రకటిస్తూ  ఆదర్శ అభిమానులుగా నిలిచారు. 

మాంచెస్టర్ వేదికగా జరిగిన  ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ లో ఓ వైపు త్రివర్ణ పతాకాలతో, బ్లూ  జెర్సీ ధరించిన అభిమానులు. మరోవైపు పాకిస్థానీ జెండాలు, జెర్సీని ధరించిన అభిమానులు మరోవైపు. వీరి మధ్యలో ఈ ఇండో పాక్ జంట విచిత్రమైన జెర్సీతో దర్శనమిచ్చారు. ఇండియా, పాకిస్థాన్ జెర్సీలను కలిపి ప్రత్యేకంగా  రూపొందించిన జెర్సీని ఈ జంట ధరించి ఇరు దేశాలను మద్దతు తెలిపింది. ఇలా క్రికెట్ అనేది దేశాల మధ్య ప్రేమను, సత్సంబంధాలను పెంచాలేగానీ వైషమ్యాలను పెంచకూడదన్నది ఈ జంట జెర్సీలోని అంతరార్థంగా కనిపిస్తోంది. 

ఇలా ఈ జంట ధరించిన  జెర్సీ ప్రత్యేకంగా వుండటంతో కొందరు అభిమానులు వీరిని ఫోటో తీసి  సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో నెటిజన్లకు కూడా ఈ దంపతుల ఆలోచన నచ్చడంతో ఈ ఫోటో  తెగ  వైరల్ అవుతోంది. ఒకప్పుడు ప్రేమతో దేశ సరిహద్దులను చెరిపేసిన ఈ జంట ఇప్పుడు అభిమానంతో మరోసారి ఆ పని చేసి అందరికి ఆదర్శంగా నిలిచారు. ఆదర్శ జంటగానే కాదు ఆదర్శ అభిమానులుగా వీరిని  ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios