Asianet News TeluguAsianet News Telugu

ఐసిసి ప్రపంచ కప్ టీం...కోహ్లీకి దక్కని అవకాశం వారిద్దరికి దక్కింది

స్వదేశంలో జరిగిన ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ టోర్నీ ద్వారా ఇంగ్లాండ్ జట్టు తన చిరకాల వాంఛను పూర్తిచేసుకుంది. నిన్న(ఆదివారం) లార్డ్స్ వేదికన జరిగిన ఫైనల్ ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఇంగ్లాండ్ ను మొదటిసారి విశ్వవిజేతగా నిలబెట్టింది. వరుసగా రెండోసారి ఫైనల్ కు చేరినప్పటికి న్యూజిలాండ్ ప్రపంచ కప్ ట్రోఫీ మరోసారి మిస్సయ్యింది. ఇలా ఐసిసి ప్రపంచ కప్ మెగా టోర్నీ విజవంతంగా ముగిసిన విషయం తెలిసిందే.  అయితే ఈ టోర్నీలో అత్యుత్తమంగా ఆడిన ఆటగాళ్లందరిని కలిపి ఐసిసి తాజాగా  ఓ క్రికెట్ జట్టును రూపొందించింది. ఈ జట్టులో టీమిండియా నుండి ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కింది. 

world cup 2019: icc announced Team of the Tournament
Author
London, First Published Jul 15, 2019, 7:11 PM IST

స్వదేశంలో జరిగిన ప్రతిష్టాత్మక ప్రపంచ కప్ టోర్నీ ద్వారా ఇంగ్లాండ్ జట్టు తన చిరకాల వాంఛను పూర్తిచేసుకుంది. నిన్న(ఆదివారం) లార్డ్స్ వేదికన జరిగిన ఫైనల్ ఎన్నో మలుపులు తిరిగి చివరికి ఇంగ్లాండ్ ను మొదటిసారి విశ్వవిజేతగా నిలబెట్టింది. వరుసగా రెండోసారి ఫైనల్ కు చేరినప్పటికి న్యూజిలాండ్ ప్రపంచ కప్ ట్రోఫీ మరోసారి మిస్సయ్యింది. ఇలా ఐసిసి ప్రపంచ కప్ మెగా టోర్నీ విజవంతంగా ముగిసిన విషయం తెలిసిందే.  అయితే ఈ టోర్నీలో అత్యుత్తమంగా ఆడిన ఆటగాళ్లందరిని కలిపి ఐసిసి తాజాగా  ఓ క్రికెట్ జట్టును రూపొందించింది. ఈ జట్టులో టీమిండియా నుండి ఇద్దరు ఆటగాళ్లకు చోటు దక్కింది. 

ఐసిసి ప్రకటించిన టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి చోటు దక్కలేదు. అతడు ఈ టోర్నీలో మ్యాచ్ ను మలుపు తిప్పగలిగే ఇన్నింగ్స్ ఒక్కటి కూడా ఆడలేకపోయాడు. సాధారణంగా హాఫ్ సెంచరీలతో చెలరేగి మంచి పరుగులే సాధించినా ఫలితాన్ని ప్రభావితం చేసేలా ఆడలేకపోయాడు. దీంతో  అతడికి ఐసిసి పరిగణలోకి తీసుకోనట్లు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

అయితే ఈ ఐసిసి జట్టులో ఇద్దరు టీమిండియా ఆటగాళ్లకు చోటు దక్కింది. అందులో ఒకరు గోల్డెన్ బ్యాట్ విజేత రోహిత్ శర్మ కాగా మరొకరు యార్కర్ స్పెషలిస్ట్ బౌలర్ జస్ప్రీత్ సింగ్ బుమ్రా. ఇంగ్లాండ్ గడ్డపై వీరిద్దరు తమ అద్బుత ప్రదర్శనతో ప్రతి గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు. దీంతో వీరు ఐసిసి జట్టులో  చేరడం పెద్ద ఆశ్చర్యమేమీ కలిగించడం లేదు. వీరిద్దరికి ఐసిసి టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ లో చేరడానికి అన్ని అర్హతలున్నాయి.

ఇక ఈ జట్టులో ప్రపంచ కప్ ఫైనల్ ఆడిన ఇంగ్లాండ్ నుండి నలుగురు, న్యూజిలాండ్ నుండి ముగ్గురు ఎంపికయ్యారు. ఆ తర్వాత భారత్, ఆస్ట్రేలియాల నుండి ఇద్దరేసి ఆటగాళ్లకు చోటు దక్కింది. బంగ్లాదేశ్ నుండి ఒక ఆటగాడు ఈ జట్టులో చేరాడు. అయితే  ఈ జట్టులో దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండిస్,పాకిస్థాన్, అప్ఘానిస్థాన్ జట్ల నుండి  ఒక్క ఆటగాడికి కూడా ఈ జట్టులో చోటు దక్కలేదు. 

టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ లో చోటు దక్కించుకున్న ఆటగాళ్లు(దేశాలవారిగా)

ఇండియా: రోహిత్ శర్మ, జస్ప్రీత్ సింగ్ బుమ్రా 

ఆస్ట్రేలియా:  అలెక్స్ క్యారీ, మిచెల్ స్టార్క్ 

బంగ్లాదేశ్: షకిబ్ అల్ హసన్

ఇంగ్లాండ్: జేసన్ రాయ్, జో రూట్, బెన్  స్టోక్స్, జోఫ్రా ఆర్చర్

న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్, పెర్గ్ సన్, ట్రెంట్ బౌల్ట్(12వ ఆటగాడు)
 
Follow Us:
Download App:
  • android
  • ios