వరల్డ్ కప్ వివాదం: రూ.2000ల ఉదాహరణ.... ఐసిసిపై అమితాబ్ సెటైర్లు

ఇంగ్లాండ్ వేదికన జరిగిన ప్రపంచ కప్ విజేతలను నిర్ణయించడానికి ఐసిసి ఉపయోగించి బౌండరీ నిబంధనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఈ నేపథ్యంలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఐసిసి నిబంధనలపై సెటైర్లు విసిరారు. 

 

 

 

world cup 2019 final issue....amitabh bacchan satirical  tweet on icc

ఇంగ్లాండ్ వేదికన జరిగిన ప్రపంచ కప్  టోర్నీలో ఐసిసి వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రీడాస్పూర్తికి విరుద్దంగా  వుండేలా ఐసిసి రూపొందించిన కొన్ని నిబంధనలు ఈ టోర్నీ ద్వారా  బయటపడ్డాయి. ప్రపంచ కప్ వంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్ తుది విజేతను నిర్ణయించడానికి ఈ నిబంధనలు వాడాల్సి రావడం మరింత వివాదాస్పదమవుతోంది. వరల్డ్ కప్ ఫైనల్లో బౌండరీల ఆధారంగా ఇంగ్లాండ్ ను విజేతగా నిర్ణయించడంపై క్రికెట్ ప్రియులు, మాజీ క్రికెటర్లు, క్రికెటర్లే కాకుండా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఐసిసిని తప్పుబడుతున్నారు. ఇలా బాలీవుడ్ స్టార్ యాక్టర్, బిగ్ బి  అమితాబ్ బచ్చన్ కూడా ఐసిసి నిబంధనలపై సెటైర్లు విసిరారు. 

ప్రపంచ కప్ ఫైనల్లో  ఐసిసి  అనుసరించి విధానాన్ని ఓ ఉదాహరణ ద్వారా అమితాబ్ వివరించారు. '' మీ దగ్గర రూ.2000, నా దగ్గర కూడా ఓ రూ.2000 ఉన్నాయనుకొండి. మీ వద్ద రెండు వేల రూపాయల నోటు వుంటే నా దగ్గర మాత్రం నాలుగు రూ.500 నోట్లు వున్నాయి. అప్పుడు మనిద్దరిలో ఎవరు ధనవంతుడని ప్రశ్నిస్తే ఎక్కువ నోట్లున్నాయి కాబట్టి నేనే ధనవంతున్నని ఐసిసి నిర్ణయిస్తుంది. '' అంటూ అమితాబ్ ఐసిసిపై ట్విట్టర్ ద్వారా సెటైర్లు విసిరారు. 

ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచ కప్ 2019 ఫైనల్లో ఇరు జట్లు ఒకే స్కోరు చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించాల్సి  వచ్చింది. ఈ సూపర్ ఓవర్లో ఇరు జట్లు సమానంగా పరుగులు సాధించడంతో ఐసిసి కొత్త నిబంధన ఒకటి బయటకు వచ్చింది. ఇలాంటి సమయంలో ఏ జట్టయితే అత్యధిక బౌండరీలు బాదిందో ఆ జట్టున విజేతలుగా ప్రకటించాలన్నది ఆ నిబంధన సారాంశం.

ఇలా అత్యధిక బౌండరీలు బాదిన ఇంగ్లాండ్ ప్రపంచ కప్ విజేతగా నిలవగా న్యూజిలాండ్ రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఐసిసి రూపొందించిన ఇలాంటి నిబంధనల వల్ల కేవలం అదృష్టంతోనే విజేతలుగా మారుతున్నారని...అత్యుత్తమంగా ఆడిన జట్లకు న్యాయం జరగడం లేదని విమర్శలు వస్తున్నాయి. తాజాగా అమితాబ్ కూడా ఇలాంటి నిబంధనల వల్ల ఎలా నష్టం జరుగుతుందో కాస్త సెటైరికల్ గా వివరించాడు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios