Asianet News TeluguAsianet News Telugu

ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచ్: వార్నర్, ధోనిలను వెనక్కినెట్టి... సచిన్ రికార్డుపై కన్నేసిన రోహిత్

ప్రపంచ కప్ సీజన్ 12లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ హవా కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీని సెంచరీతో ఆరంభించిన అతడు ఆ ఊపును అలాగే కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు అతడు ఆడిన ఏడు మ్యాచుల్లో నాలుగు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాధించాడంటేనే అతడి విద్వంసం ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా బంగ్లాదేశ్ పై కూడా సెంచరీ బాదిన రోహిత్ రికార్డుల మోత మోగించాడు. 

world cup 2019: dhoni breaks ms dhoni record  and near to  sachin  record
Author
Birmingham, First Published Jul 2, 2019, 8:14 PM IST

ప్రపంచ కప్ సీజన్ 12లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ హవా కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీని సెంచరీతో ఆరంభించిన అతడు ఆ ఊపును అలాగే కొనసాగిస్తున్నాడు. ఇప్పటివరకు అతడు ఆడిన ఏడు మ్యాచుల్లో నాలుగు సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాధించాడంటేనే అతడి విద్వంసం ఏ స్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా బంగ్లాదేశ్ పై కూడా సెంచరీ బాదిన రోహిత్ రికార్డుల మోత మోగించాడు. 

ఇంగ్లాండ్ లో జరుగుతున్న ఈ ప్రపంచ కప్ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. భారత్-బంగ్లా మ్యాచ్ కు ముందు ఆసిస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 516 పరుగులతో ఈ జాబితాలో మొదటి స్థానంలో వున్నాడు. తాజాగా సాధించిన సెంచరీ(104  పరగులు)తో రోహిత్ పరుగులు 544 కు చేరుకున్నాయి. ఇలా వార్నర్ ను వెనక్కినెట్టిన రోహిత్ సచిన్ రికార్డుపై కన్నేశాడు. 

ఓ ప్రపంచ కప్ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన భారతీయ ఆటగాడు సచిన్ టెండూల్కర్. అతడు 2003 వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించి 673 పరుగులు చేశాడు. ఆ తర్వాత 544 పరుగులతో రోహిత్ రెండో స్థానంలో ఆక్రమించాడు. ఈ టోర్నీ చివరివరకు రోహిత్ ఇదే జోరు కొనసాగిస్తే సునాయాసంగా సచిన్ రికార్డును బద్దలుగొట్టడం ఖాయం. 

ఇక గతంలోనే ధోని అత్యధిక సిక్సర్ రికార్డును రోహిత్ అదిగమించిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల మళ్లీ ధోని ఆ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే రోహిత్ ఈ మ్యాచ్ లో ఏకంగా ఐదు సిక్సులు బాదాడు. దీంతో వన్డేల్లో అత్యధిక సిక్సర్లు(230)  రికార్డు రోహిత్ పేరుపైకి మారింది. ధోని 228 సిక్సర్లతో రెండో స్థానానికి పడిపోయాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios