ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ బాగా దూకుడు స్వభావం కలిగిన ఆటగాడు.  కేవలం మైదానంలోనే కాదు బయట కూడా అతడు చాలా వివాదాస్పద ఆటగాడు. అతడు తన దుందుడుకు చర్యలతో సహచరులతోనే కాదు ప్రత్యర్థి ఆటగాళ్లతో కూడా శతృత్వాన్ని పెంచుకునేవాడు. అయితే ఇదంతా బాల్ ట్యాంపరింగ్ వివాదానికి ముందు. ఈ వివాదంతో ఏడాది కాలం తనకెంతో ఇష్టమైన క్రికెట్ కు దూరమైన అతడి  వ్యక్తిత్వంలో చాలా మార్ను వచ్చింది. అదే తాజాగా ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న  ప్రపంచ కప్ లో భయపటడింది. 

టౌన్టన్ వేదికగా నిన్న(బుధవారం) ఆస్ట్రేలియా జట్టు పాకిస్థాన్ తో తలపడింది.ఈ మ్యాచ్ లో కెప్టెన్ పించ్ తో కలిసి చెలరేగి ఆడిన వార్నర్ అద్భుతమైన సెంచరీని అందుకున్నాడు. కేవలం 111 బంతుల్లోనే 107 పరుగులు చేసిన పాక్ పై ఆసిస్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇలా మ్యాచ్ విన్నర్ గా నిలిచిన అతడికి మ్యాన్  ఆఫ్ ది మ్యాచ్ లభించింది. 

అయితే ఈ ట్రోపిని అతడు ఓ చిన్నారి అభిమానికి అందించి గొప్పమనసును చాటుకున్నాడు. ఆస్ట్రేలియా మ్యాచ్ గెలిచిన తర్వాత ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్న వార్నర్ డ్రెస్సింగ్ రూం వైపు వెళుతుండగా ఓ బాలుడు ఆటోగ్రాఫ్ కావాలని  కోరాడు. దీంతో అతడివద్దకు వెళ్లి కేవలం ఆటోగ్రాఫ్ ఇవ్వడమే కాదు తన చేతిలో వున్న మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అందించాడు. దీంతో ఆ బాలుడి ఆనందానికి అవదుల్లేకుండా పోయింది. 

ఇలా ఓ అభిమాని కోసం తన సెంచరీకి గుర్తింపుగా  వచ్చిన అవార్డును కూడా వార్నర్ వదులుకున్నాడు. దీంతో గతంలో వార్నర్ ప్రవర్తనను చూసిన వారు....అప్పటికి, ఇప్పటికి అతడిలో ఎంతో మార్పు వచ్చిందని  అంటున్నారు. ఓ సామాన్య అభిమానిపై అతడు చూపించిన ప్రేమకు వారు ఫిదా అయ్యారు.