Asianet News TeluguAsianet News Telugu

టీమిండియాపై మేం ప్రయోగించే ప్రధాన అస్త్రం అతడే: బంగ్లాదేశ్ కెప్టెన్

ప్రపంచ కప్ టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతూ మంచి జోరుమీదున్న టీమిండియాకు ఇంగ్లాండ్ జట్టు షాకిచ్చిన విషయం తెలిసిందే. బర్మింగ్ హామ్ ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన పోరులో ఇండియా పై ఆతిథ్య జట్టు పైచేయి సాధించింది. ఇలా ఈ మెగా టోర్నీలో మొదటి ఓటమిని చవిచూసిన భారత్ కు మరో ఓటమి రుచి చూపిస్తామని బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్రఫే మోర్తజా హెచ్చరించాడు. ఇవాళ(మంగళవారం) జరిగే మ్యాచ్ లో టీమిండియాను అడ్డుకోడానికి తాము పక్కా వ్యూహాలతో బరిలోకి బరిలోకి దిగుతున్నట్లు బంగ్లా కెప్టెన్ పేర్కొన్నాడు. 

world cup  2019: bangla captain mashrafe mortaza comments about india vs bangladesh match
Author
Birmingham, First Published Jul 2, 2019, 2:06 PM IST

ప్రపంచ కప్ టోర్నీలో వరుస విజయాలతో దూసుకుపోతూ మంచి జోరుమీదున్న టీమిండియాకు ఇంగ్లాండ్ జట్టు షాకిచ్చిన విషయం తెలిసిందే. బర్మింగ్ హామ్ ఎడ్జ్ బాస్టన్ వేదికగా జరిగిన పోరులో ఇండియా పై ఆతిథ్య జట్టు పైచేయి సాధించింది. ఇలా ఈ మెగా టోర్నీలో మొదటి ఓటమిని చవిచూసిన భారత్ కు మరో ఓటమి రుచి చూపిస్తామని బంగ్లాదేశ్ కెప్టెన్ ముష్రఫే మోర్తజా హెచ్చరించాడు. ఇవాళ(మంగళవారం) జరిగే మ్యాచ్ లో టీమిండియాను అడ్డుకోడానికి తాము పక్కా వ్యూహాలతో బరిలోకి బరిలోకి దిగుతున్నట్లు బంగ్లా కెప్టెన్ పేర్కొన్నాడు. 

ఇంగ్లాండ్ చేతిలో ఓడిన బర్మింగ్ హామ్ ఎడ్జ్ బాస్టన్ మైదానంలోనే భారత జట్టు బంగ్లాతో తలపడుతోంది. అంతేకాకుండా గత మ్యాచ్ లో ఓటమిపాలవడంతో భారత  ఆటగాళ్లపై తప్పకుండా ఒత్తిడి  వుంటుంది. ఇలా టీమిండియాకు వ్యతిరేకంగా వున్న అంశాలను తాము సానుకూలంగా మార్చుకుని గెలుపొందడానికి అన్ని ప్రయత్నాలు  చేస్తామని మోర్తాజా తెలిపాడు. 

ఇండియా-బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా మోర్తజా మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా భారత జట్టును ఓడించడానికి తాము ఉపయోగించే ప్రదాన అస్త్రం షకీబ్ అల్ హసన్. ఈ ప్రపంచ కప్ లో అతడు అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్ లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు. కాబట్టి టీమిండియాపై కూడా అతడు చెలరేగి బంగ్లాకు విజయాన్ని అందిస్తాడని నమ్మకంతో వున్నట్లు పేర్కొన్నాడు. అతడు ఈ మ్యాచ్ లో చాలా కీలకంగా వ్యవహరించనున్నాడని మోర్తజా  తెలిపాడు. 

ఈ మ్యాచ్ తో తమ సెమీస్ అవకాశాలు ముడిపడి వున్నాయి కాబట్టి తప్పకుండా గెలిచి తీరాలన్న పట్టుదలతో ఆడతాం. ఇప్పటివరకు మేం ఆడిన ఆట ఒకెత్తయితే ఇప్పుడు మేము ఆడే ఆట మరో ఎత్తు. భారత జట్టును ఎదుర్కోవాలంటే మేం అత్యుత్తమ క్రికెట్ ఆడాలి. కాబట్టి ఈ మ్యాచ్ లో ప్రతి బంగ్లా ఆటగాడు వందశాతం రాణించి జట్టును గెలపించుకుంటారన్న నమ్మకం వుందని మోర్తజా వెల్లడించాడు.    
 
Follow Us:
Download App:
  • android
  • ios