లండన్ లోని ప్రముఖ స్టేడియం లార్డ్స్ వేదికన జరిగిన చివరి ప్రపంచ కప్ మ్యాచ్ లో బంగ్లాపై  పాక్ ఘన విజయం సాధించింది. ఇలా 92 పరుగుల భారీ  తేడాతో బంగ్లాను ఓడించినప్పటికి పాక్ సెమీస్ కు చేరలేకపోయింది. అయతే పాక్ అభిమానులను నిరాశపర్చిన ఈ మ్యాచ్ లోనే ఓ అరుదైన రికార్డు నమోదయ్యింది. ఈ మ్యాచ్ ద్వారా పాక్ ఆటగాడు బాబర్ ఆజమ్ ఓ అరుదైన ఘనత సాధించాడు. 96 పరుగల వద్ద ఔటై సెంచరీ మిస్సయినప్పటికి ఓ ప్రపంచ కప్ టోర్నీలో అత్యధిక పరుగుల సాధించిన ఆటగాడిగా  ఆజమ్ రికార్డు సృష్టించాడు.

బంగ్లాదేశ్ పై సాధించిన 96 పరుగులతో కలుపుకుని ఈ మెగా టోర్నీ మొత్తంలో బాబర్ 474 పరుగులు చేశాడు. ఇలా ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటివరకు ఏ పాకిస్థాన్ క్రికెటర్ కూడా ఇన్ని పరుగులు చేయలేకపోయాడు. 1992 వరల్డ్ కప్ లో మియాందాద్ సాధించిన 437 పరుగులే ఇప్పటివరకు హయ్యెస్ట్. తాజాగా ఆ రికార్డును బాబర్ ఆజమ్ బద్దలుగొట్టాడు. 

ఈ ప్రపంచ కప్ టోర్నీలో పాకిస్థాన్ జట్టు విఫలమైనప్పటికి బాబర్ ఆజమ్ నిలకడగా  రాణించాడు. టోర్నీమొత్తంలో ఓ సెంచరీతో పాటు మూడు హాఫ్ సెంచరీలో 474 పరుగులు చేయగలిగాడు. న్యూజిలాండ్ వంటి బలమైన జట్టుపై సెంచరీతో అదరగొట్టి పాక్ కు అద్భుత విజయాన్ని అందించాడు. ఇలా ఇంగ్లాండ్ పిచ్ లపై రాణించిన ఆజమ్ చివరి మ్యాచ్ లో పాక్ దిగ్గజం మియాందాద్ రికార్డునే బద్దలుగొట్టాడు.