మాజీ టీమిండియా ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ క్రికెటర్ గా ఎంత సీరియస్ గా వుండేవాడో రిటైరైన తర్వాత అంత ఫన్నీగా మారిపోయాడు. ఎంత  సీరియస్ విషయాన్నయినా తనదైన స్టైల్లో హాస్యాన్ని పండిస్తూ చెబుతాడు. ఇక సోషల్ మీడియాలో అతడంత యాక్టివ్ గా మరే క్రికెటర్ కూడా వుండరు. కేవలం క్రికెట్ విషయాలనే కాదు సామాజిక, జాతీయ, అంతర్జాతీయ  అంశాలను కూడా సృశిస్తూ కామెడీ పండిస్తుంటాడు. తాజాగా సెహ్వాగ్ ప్రపంచ కప్ కు వేదికగా మరిన ఇంగ్లాండ్ మైదానాలపై తనదైన రీతీలో స్పందించాడు. మైదానాల ఆకృతికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి  వాటిపై వ్యంగ్యంగా కామెంట్స్ చేశాడు. 

ఇంగ్లాండ్ లో మొత్తం పదకొండు అంతర్జాతీయ క్రికెట్ మైదానాలుండగా...అవన్నీ గుడ్రంగా కాకుండా అడ్డదిడ్డంగా  వున్నాయి. కేవలం సౌతాంప్టన్ లోని రోస్ బౌల్ మైదానమొక్కటే చక్కగా గుడ్రంగా వుంది. అయితే ఈ సౌతాంప్టర్ మైదానంతో మిగతా మైదానాలపై  పోలుస్తూ సెహ్వాగ్ చలోక్తులు విసిరాడు. '' నేను రోటీ చేయడానికి ప్రయత్నిస్తూ రోజ్ బౌల్( గుడ్రంగా వుండే గ్రౌండ్) లాంటిది చేయాలనుకున్నా...కానీ అది హెడింగ్లీ(వంకరటింకరగా వుండే గ్రౌండ్) మాదిరిగా  తయారయ్యింది. మరి మీ రోటి పరిస్థితి ఏంటి'' అంటూ సెహ్వాగ్ నెటిజన్లను ప్రశ్నించాడు. 

ఇంగ్లాండ్ లోని మొత్తం మైదానాల ఆకృతికి సంబంధించిన ఫోటోను ముందుగా  పోస్ట్ చేశాడు. ఆ తర్వాత ఆ కామెంట్ ను జతచేశాడు. ఇలా సెహ్వాగ్ వ్యంగ్యంగా పెట్టిన పోస్ట్ నెటిజన్లకు అమితంగా నచ్చినట్లుంది. దీంతో ఇంగ్లాండ్ మైదానాల ఆకృతికి సంబంధించిన ఫోటోను తెగ షేర్ చేస్తూ దానికి తమదైన రీతిలో కామెడీ కామెంట్స్ జతచేస్తున్నారు.  
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

While making roti, i tried making Rose Bowl, but at best ended with Headingley. What’s your Roti status ?

A post shared by Virender Sehwag (@virendersehwag) on Jun 8, 2019 at 10:45pm PDT