Asianet News TeluguAsianet News Telugu

కోహ్లీని నోరెళ్లబెట్టెలా చేసిన ధోని... తన మార్క్ సిక్సర్ తో (వీడియో)

రెగ్యులర్ క్రికెట్ షాట్లకు అలవాటుపడ్డ భారత అభిమానులు కొత్తతరహా బౌండరీలను పరిచయం చేసిన ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని. యార్కర్లను అతి సులభంగా బౌండరీకి తరలించడానికి అతడు కనుగొన్న పక్కా మాస్ ఫార్ములానే హెలికాప్టర్ షాట్. వచ్చిన బంతిన వచ్చినట్లే బలంగా బాదుతూ బౌండరీకి తరలిచడమే ఈ షాట్ ప్రత్యేకత. ఇలా ఎలాంటి బంతినయినా బౌండరీకి  తరలించడంలో ధోని సిద్దహస్తుడు.  అలా గత ఆదివారం ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్ లో అతడు బాదిన అద్భుతమైన సిక్సర్ ను చూసిమ నోరెళ్లబెట్టడం కోహ్లీ వంతయ్యింది. 

team india captain kohli expression on dhoni sixer
Author
London, First Published Jun 10, 2019, 6:45 PM IST

రెగ్యులర్ క్రికెట్ షాట్లకు అలవాటుపడ్డ భారత అభిమానులు కొత్తతరహా బౌండరీలను పరిచయం చేసిన ఆటగాడు మహేంద్ర సింగ్ ధోని. యార్కర్లను అతి సులభంగా బౌండరీకి తరలించడానికి అతడు కనుగొన్న పక్కా మాస్ ఫార్ములానే హెలికాప్టర్ షాట్. వచ్చిన బంతిన వచ్చినట్లే బలంగా బాదుతూ బౌండరీకి తరలిచడమే ఈ షాట్ ప్రత్యేకత. ఇలా ఎలాంటి బంతినయినా బౌండరీకి  తరలించడంలో ధోని సిద్దహస్తుడు.  అలా గత ఆదివారం ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్ లో అతడు బాదిన అద్భుతమైన సిక్సర్ ను చూసిమ నోరెళ్లబెట్టడం కోహ్లీ వంతయ్యింది. 

ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా టీమిండియా రెండో మ్యాచ్ ను ఆసిస్ తో తలపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో శిఖర్ ధావన్ అద్భుత సెంచరీ, రోహిత్, కోహ్లీల హాఫ్ సెంచరీలతో చెలరేగారు. దీంతో ధోని క్రీజులోకి వచ్చేసరికి  స్కోరు బోర్డుపై భారీ  పరుగులున్నాయి. దీంతో అతడు కోహ్లీతో కలిసి  ఎలాంటి ఒత్తిడి  లేకుండా ఆడాడు. ఈ క్రమంలోనే ధోని ఓ కఠినమైన బంతిని అతి సునాయాసంగా బౌండరీకి తరలించి అవతలి కోహ్లీని  ఆశ్యర్యానికి గురిచేశాడు. 

ఆసిస్ బౌలర్ మిచేల్‌ స్టార్క్‌ కాళ్లదగ్గర వేసిన బంతిని ధోనీ ఫుల్ షాట్ గా మలిచి బౌండరీకి తరలించాడు. గంటకు 143 కిలోమీటర్ల వేగంగా దూసుకొచ్చిన ఆ బంతికి ధోని సిక్సర్ బాదడం చూసి అవతలి ఎండ్ లో వున్న కోహ్లీ నోరెళ్లబెట్టాడు. అనంతరం ధోని వద్దకు వచ్చి ఎదో చెప్పి ఇరగబడి నవ్వాడు. ఈ అద్భుతమన బౌండరీ, దీని కారణంగా ధోని, కోహ్లీల మధ్య విరబూసిన నవ్వులు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 352 పరుగులు భారీ స్కోరును చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైన ఆసిస్ కేవలం 316 పరుగులకే ఆలౌటయ్యింది. దీంతో  భారత 36 పరుగుల తేడాతో గెలిచి ప్రపంచ కప్ లో రెండో విజయాన్ని అందుకుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios