బర్మింగ్‌హామ్‌: ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌  శర్మ సెంచరీ టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ రికార్డును సమం చేశాడు. భారత్‌ తరఫున ఒకే ప్రపంచకప్‌లో మూడు సెంచరీ సాధించిన రెండో ఆటగాడిగా రోహిత్ రికార్డులకెక్కాడు. 

2003 ప్రపంచకప్‌లో గంగూలీ నమీబియా, కెన్యా, దక్షిణాఫ్రికాలపై సెంచరీలు చేసి అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా ఘనత సాధించాడు. 

ప్రస్తుత ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై అజేయంగా 122, పాకిస్థాన్‌పై 140, ఇంగ్లాండ్‌పై 102 పరుగులు చేసి గంగూలీ రికార్డును రోహిత్‌ సమం చేశాడు. కాగా రోహిత్‌కు ఇది తన కెరీర్‌లో 25వ సెంచరీ.

అదివారం జరిగిన మ్యాచులో రోహిత్ శర్మ సెంచరీ చేసినప్పటికీ ఇంగ్లాండుపై భారత్ 31 పరుగుల తేడాతో ఓడిపోయింది.