Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచ కప్ 2019: వినూత్నం... టీమిండియాపై అభిమానంతో యాగశాలకు

క్రికెట్... ప్రస్తుతం మన దేశంలో దాన్ని ఓ క్రీడలా కాకుండా తమ జీవితంలో ఓ భాగంగా చూస్తుంటారు అభిమానులు. టీమిండియా అభిమానులు ఎంతలా ప్రేమ పెంచుకున్నారంటే జట్టు ఓడితే  తాము ఓడినట్లుగా ఫీల్ అవుతుంటారు. ఇక ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో అయితే గతంలో భారత జట్టు ఓడిపోయిన సందర్భాల్లో కొందరు అభిమానులు గుండెపోటుకు గురైన సందర్భాలుు కూడా వున్నాయి. అలాంటి మన దేశంలో మరోసారి ప్రపంచ కప్ ఫీవర్ మొదలయ్యింది. ఇవాళ్టి(బుధవారం) నుండి  టీమిండియా  మ్యాచ్ ఆరంభం కానున్న నేపథ్యంలో అభిమానుల సందడి మొదలయ్యింది. 

Prayers Offered For India's Success In Opening World Cup Match
Author
Varanasi, First Published Jun 5, 2019, 4:59 PM IST

క్రికెట్... ప్రస్తుతం మన దేశంలో దాన్ని ఓ క్రీడలా కాకుండా తమ జీవితంలో ఓ భాగంగా చూస్తుంటారు అభిమానులు. టీమిండియా అభిమానులు ఎంతలా ప్రేమ పెంచుకున్నారంటే జట్టు ఓడితే  తాము ఓడినట్లుగా ఫీల్ అవుతుంటారు. ఇక ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలో అయితే గతంలో భారత జట్టు ఓడిపోయిన సందర్భాల్లో కొందరు అభిమానులు గుండెపోటుకు గురైన సందర్భాలుు కూడా వున్నాయి. అలాంటి మన దేశంలో మరోసారి ప్రపంచ కప్ ఫీవర్ మొదలయ్యింది. ఇవాళ్టి(బుధవారం) నుండి  టీమిండియా  మ్యాచ్ ఆరంభం కానున్న నేపథ్యంలో అభిమానుల సందడి మొదలయ్యింది. 

ఉత్తర ప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసికి చెందిన కొందరు టీమిండియాపై తమ అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. ఎలాంటి అశుభాలు ఎదురవకుండా టీమిండియా ప్రపంచ కప్ ట్రోపిని అందుకోవాలంటూ వారు కోరుకున్నారు. అంతేకాకుండా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఆరంభ మ్యాచ్ గెలవాలంటూ ప్రత్యేకంగా యాగాన్ని తలపెట్టారు. దేవతామూర్తులకు నైవేద్యం సమర్పిస్తూ ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న ప్రపంచ కప్ లో భారత జట్టుకు ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకోవాలని వేడుకున్నారు. 

ఈ యాగంలో పాల్గొన్న అభిమానులు తిరంగ జెండాలను చేతబూని టీమిండియాకు అనుకూలంగా నినాదాలు చేశారు. దక్షిణాఫ్రికాను ఓడించి ప్రపంచ కప్ ను ఘనమైన విజయంతో ఆరంభించాలని వారు కోరుకున్నారు. 

సఫారీ జట్టుకు కీలకమైన ఇద్దరు బౌలర్లు దూరమవడంతో బౌలింగ్ విభాగం బలహీనంగా మారింది. ఎంగిడి, స్టెయిన్ వంటి కీలక బౌలర్లు లేకపోవడం...ఇంగ్లాండ్,   బంగ్లాదేశ్ జట్ల చేతిలో ఓటమిపాలై ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి వుండటం భారత జట్టుకు  కలిసిరానుంది. అంతేకాకుండా టీమిండియా కూడా అన్ని విభాగాల్లో పటిష్టంగా వుంది. దీనికి తోడు ఈ అభిమానులు చేపట్టిన యాగం కూడా ఫలిస్తే  టీమిండియా గెలుపు ఖాయమే. 

Follow Us:
Download App:
  • android
  • ios