మనమేదైన కొత్త పని మొదలుపెట్టినప్పుడు కుడి చేతిని శుభసూచకంగా వాడుతుంటాం. అలాగే కుడి కాలిని కూడా శుభకార్యాల సమయంలో, కొత్త ప్రదేశాల్లో ప్రవేశించేపుడు ఉపయోగిస్తాం.ఇలా సామాన్యులే కాదు చాలామంది ఆటగాళ్లు ముఖ్యంగా క్రికెటర్లు ఇలాంటి నమ్మకాలను ఎక్కువగా కలిగివుంటారు. అయితే టీమిండియా ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనికి కూడా అలాంటి నమ్మకమే వుందట. కానీ అందరు కుడిని ఉపయోగిస్తే ఇతడు భిన్నంగా ఎడమను అదృష్ట సూచికగా బావిస్తాడట. ఈ విషయాన్ని స్వయంగా ధోనియో బయటపెట్టాడు. 

ప్రస్తుతం ప్రపంచ కప్ నేపథ్యంలో జట్టు సభ్యులతో కలిసి ధోని ఇంగ్లాండ్ లో వున్నాడు. అయితే అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో అతడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధోని మాట్లాడుతూ....తనకు కూడా కొన్ని నమ్మకాలున్నాయని... వాటిని పాటిస్తే మంచి జరుగుతుందని నమ్ముతానన్నారు. కానీ తనవి నమ్మకాలు మాత్రమేనని...మూడనమ్మకాలు కావని ధోని స్పష్టం చేశాడు.   

ముఖ్యంగా తాను మైదానంలో అడుగుపెట్టేపుడు ఎడమకాలు ముందు పెట్టి వెళతానన్నారు. అలా  చేయడం తన కెరీర్ ఆరంభం నుండి అలవాటని పేర్కొన్నారు. అయితే తన సహచరుల్లో చాలామందికి కూడా ఈ అలవాటుందని...కానీ వారంతా కుడి కాలిని ముందు మైదానంలో పెడతారని తెలిపారు. తనకు మాత్రం ఎడమకాలు పెట్టడం సెంటిమెంట్ గా మారిందని వెల్లడించారు. 

అలాగే మరికొన్ని విషయాల్లోకూడా కొన్ని సెంటిమెంట్స్ ని ఫాలో అవుతానని ధోని బయటపెట్టాడు  టాస్ విషయంలోనూ తనకు కొన్ని నమ్మకాలుండేవని...అయితే అవి కేవలం టీమిండియా  కెప్టెన్ గా వున్నపుడు మాత్రమే పాటించేవాడినన్నారు. అయితే ఐపిఎల్ లో అలాంటివేవీ పట్టించుకోవడం లేదని ధోని క్రికెట్లో తన సెంటిమెంట్స్ గురించి బయటపెట్టాడు.