Asianet News TeluguAsianet News Telugu

ఇండియా-న్యూజిలాండ్ మ్యాచ్: విలియమ్సన్ సరికొత్త రికార్డు

భారత్-న్యూజిలాండ్ మధ్య  జరుగుతున్న  ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే అతడు ఓ అరుదైన  ప్రపంచ కప్ రికార్డును కూడా సాధించాడు. ఇంగ్లాండ్ వేదికన జరుగుతున్న ఈ మెగా టోర్నీ మొత్తంలో కివీస్ కెప్టెన్ 548 పరుగులు బాదాడు. దీంతో ఓ ప్రపంచ కప్ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన న్యూజిలాండ్ ఆటగాడిగా విలియమ్సన్ చరిత్ర సృష్టించాడు. 

icc world  cup semifinal:  new zealand captain williamson new record in world cup 2019
Author
Manchester, First Published Jul 9, 2019, 7:51 PM IST

భారత్-న్యూజిలాండ్ మధ్య  జరుగుతున్న  ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ లో కేన్ విలియమ్సన్ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే అతడు ఓ అరుదైన  ప్రపంచ కప్ రికార్డును కూడా సాధించాడు. ఇంగ్లాండ్ వేదికన జరుగుతున్న ఈ మెగా టోర్నీ మొత్తంలో కివీస్ కెప్టెన్ 548 పరుగులు బాదాడు. దీంతో ఓ ప్రపంచ కప్ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన న్యూజిలాండ్ ఆటగాడిగా విలియమ్సన్ చరిత్ర సృష్టించాడు. 

అంతకు ముందు ఈ రికార్డు కివీస్ సీనియర్ ప్లేయర్ మార్టిన్ గుప్తిల్ పేరిట వుండేది. అతడు గత వరల్డ్ కప్(2015) లో అద్భుతంగా ఆడి ఫైనల్ కు చేర్చాడు. ఇలా అతడు టోర్నీ మొత్తంలో 547 పరుగులు చేసి జట్టును ఫైనల్ కు చేర్చడంలో ముఖ్యపాత్ర పోషించాడు. తాజాగా విలియమ్సన్ అతడి అత్యధిక పరుగుల రికార్డును బద్దలుగొట్టాడు. 

టీమిండియా బౌలర్లను సమర్థవంతంగా ఎందుర్కొంటే విలియమ్సన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఓ వైపు వికెట్లు పడుతున్న సమయోచితంగా బ్యాటింగ్ కొనసాగిస్తూ 95 బంతుల్లో 67 పరుగులు చేశాడు. అయితే భారత బౌలర్ చాహల్ మణికట్టు మాయాజాలంతో విసిరిన బంతిని అంచనావేయలేక జడేజాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 

ప్రస్తుతం భారత్-కివీస్ మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. మరో నాలుగు ఓవర్లలో కివీస్ బ్యాటింగ్ ముగుస్తుందనగా జోరున వర్షం మొదలయ్యింది. దీంతో అంపైర్లు మ్యాచ్ ను నిలిపివేశారు. ఆ  సమయానికి కివీస్ ఐదు వికెట్ల నష్టానికి 211 పరుగుల వద్ద నిలిచింది. 
 
Follow Us:
Download App:
  • android
  • ios