Asianet News TeluguAsianet News Telugu

సెమీ ఫైనల్ రేసులో ఈ జట్లే: పాకిస్తాన్ ఆశ ఇదే...

భారత్ పై గెలిచి సెమీ ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని భావించిన బంగ్లాదేశ్ ఆశలు గల్లంతయ్యాయి. భారత్ పై ఓడిపోయి బంగ్లాశ్ ఇంటి ముఖం పట్టాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. న్యూజిలాండ్, పాకిస్తాన్, ఇంగ్లాండు సెమీ ఫైనల్ కు పోటీ పడుతున్నాయి.

ICC CWC'19 semi-final qualification: Pak hopes on Kiwis defeat
Author
London, First Published Jul 3, 2019, 4:55 PM IST

లండన్: ప్రపంచ కప్ పోటీల్లో సెమీ ఫైనల్ కు చేరుకోవడానికి మూడు జట్లు పోటీ పడుతున్నాయి. ఆస్ట్రేలియా, భారత్ ఇప్పటికే సెమీ ఫైనల్ కు చేరుకున్నాయి. వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంక, అప్ఘానిస్తాన్, దక్షిణాఫ్రికా పోటీ నుంచి ఇప్పటికే తప్పుకున్నాయి. 

భారత్ పై గెలిచి సెమీ ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలని భావించిన బంగ్లాదేశ్ ఆశలు గల్లంతయ్యాయి. భారత్ పై ఓడిపోయి బంగ్లాశ్ ఇంటి ముఖం పట్టాల్సిన పరిస్థితిని తెచ్చుకుంది. న్యూజిలాండ్, పాకిస్తాన్, ఇంగ్లాండు సెమీ ఫైనల్ కు పోటీ పడుతున్నాయి.

విజయం సాధించిన జట్టుకు రెండు పాయింట్లు వస్తాయి. మ్యాచ్ టై అయినా, రద్దయినా ఇరు జట్లకు చెరో పాయింట్ వస్తుంది. రెండు జట్ల పాయింట్లు సమానంగా ఉంటే, ఇంతవరకు ఏ జట్టు ఎక్కువ మ్యాచులు గెలిచిందనేది లెక్క తీస్తారు. ఎక్కువ మ్యాచులు గెలిచిన జట్టు సెమీ ఫైనల్ కు వెళ్తుంది. ఆ రకంగా కూడా సమానంగా ఉంటే నెట్ రన్ రేట్ ను పరిగణనలోకి తీసుకుంటారు. 

11 పాయింట్లతో న్యూజిలాండ్ మూడు జట్లలో అగ్రస్థానంలో ఉంది. బుధవారం ఇంగ్లాండుతో ఆ జట్టు తలపడుతుంది. ఇంగ్లాండుపై న్యూజిలాండ్ గెలిస్తే సెమీ ఫైనల్ కు వెళ్తుంది. పాకిస్తాన్ బంగ్లాదేశ్ పై గెలిచి 11 పాయింట్లు సాధిస్తే నెట్ రన్ రేట్ ను పరిగణనలోకి తీసుకుంటారు. 

ఇంగ్లాండు ప్రస్తుతం 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ పై బుధవారంనాడు జరుగుతున్న మ్యాచులో గెలిస్తే నేరుగా సెమీ ఫైనల్ కు వెళ్తుంది. ఒక వేళ న్యూజిలాండ్ పై ఓడిపోతే దాని భవిష్యత్తు పాకిస్తాన్ పై ఆధారపడుతుంది. బంగ్లాదేశ్ పై జరిగే మ్యాచులో పాకిస్తాన్ ఓడిపోతే ఇంగ్లాండు సెమీ ఫైనల్ కు వెళ్తుంది. 

పాకిస్తాన్ ప్రస్తుతం చివరి స్థానంలో ఉంది. న్యూజిలాండ్ ఇంగ్లాండును ఓడించడంతో పాటు పాకిస్తాన్ బంగ్లాదేశ్ ను ఓడించాల్సి ఉంటుంది. ఇలా అయితేనే పాకిస్తాన్ సెమీ ఫైనల్ కు వెళ్తుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios