ప్రపంచ కప్ మెగా టోర్నీలో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచులను పరిశీలిస్తే బౌలర్ హవా కనిపిస్తోంది. ముఖ్యంగా బౌలింగ్ తో పాటు అద్భుతమైన పీల్డింగ్ చేసిన జట్లే రెండు మ్యాచుల్లో విజేతలుగా నిలిచాయి. దీంతో తదుపరి మ్యాచుల్లో కూడా ఈ విభాగాలే ప్రముఖ పాత్ర పోషించనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఏయే జట్లు అద్భత బౌలర్లు, ఫీల్డర్లు కలిగివున్నారో అన్న చర్చ క్రికెట్ వర్గాల్లో మొదలయ్యింది. ఈ  విషయంపై తాజాగా ఆసిస్ మాజీ కెప్టెన్  మైకెల్ క్లార్క్ స్పందిస్తూ... అంతర్జాతీయ ఆటగాళ్ళందరిలో టీమిండియా ప్లేయర్ రవీంద్ర జడేజా అత్యుత్తమ పీల్డర్ అని పేర్కొన్నాడు. 

''ప్రస్తుతం ప్రపంచ కప్ ఎంపికైన ఆటగాళ్లందరిలోకెల్ల రవీంద్ర జడేజా సూపర్ ఫీల్డర్. ప్రస్తుతం అతన్ని మించిన ఆల్ రౌండర్ ఏ జట్టులోనూ లేడు. పరుగులను అడ్డుకోవడం, కష్టమైన క్యాచ్ లను అందుకోవడం, వికెట్లను గురి తప్పకుండా కొట్టి రనౌట్లు చేయడంలో అతడు దిట్ట. ఇలా అతడు బ్యాటింగ్, బౌలింగ్ తో పాటు అత్యుత్తమైన ఫీల్డింగ్ ప్రతిభతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ముఖ్యంగా అతడి కళ్లుచెదిరే పీల్డింగ్ విన్యాసాలనకు నేను చాలాసార్లు పిధా  అయ్యా''  అంటూ జడేజాపై క్లార్క్ ప్రశంసలు కురిపించాడు. 

ఈ ప్రపంచ కప్ లో భాగంగా జరిగిన మొదటి వార్మప్ మ్యాచ్ లో జడేజా బ్యాటింగ్ బ్యాటింగ్ తో కూడా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అతడొక్కడే నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీ(54 పరుగులు) లతో ఒంటరి పోరాటం చేశాడు. ఇలా వార్మప్ మ్యాచ్ అదరగొట్టిన జడేజా మెయిన్ మ్యాచుల్లో కూడా తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.