చరిత్ర సృష్టించిన జింబాబ్వే.. తొలిసారి టీ20 ప్రపంచకప్‌కు అర్హత.. స్కాట్లాండ్ ఇంటిబాట

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో గ్రూప్ - బీ నుంచి వెళ్లే రెండు జట్లేవే తేలిపోయాయి. స్కాట్లాండ్ మీద గెలిచిన జింబాబ్వే సరికొత్త చరిత్రను లిఖిస్తూ  తొలిసారి టీ20 ప్రపంచకప్ కు అర్హత సాధించింది. 

Zimbabwe book Super 12 Berth,  Beat Scotland by 5 wickets in T20 World Cup 2022

చాలాకాలంగా ఆర్థిక సంక్షోభాలతో అల్లాడుతున్న జింబాబ్వేకు ఆ దేశ క్రికెటర్లు  కాసింత ఉపశమనమిచ్చారు.  ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టీ20  ప్రపంచకప్ లో క్వాలిఫై రౌండ్ ఆడిన  ఈ ఆఫ్రికన్ జట్టు..  తొలిసారి  ఈ మెగా టోర్నీ ఆడబోతున్నది. శుక్రవారం ముగిసిన క్వాలిఫయర్ రౌండ్ ఆఖరి మ్యాచ్ లో  స్కాట్లాండ్ ను ఓడించిన జింబాబ్వే సూపర్ -12కు అర్హత సాధించింది. ఫలితంగా ఆ జట్టు.. ఐర్లాండ్ తర్వాత  గ్రూప్-బీ నుంచి సూపర్-12కు క్వాలిఫై అయిన రెండో జట్టుగా నిలిచింది. 

హోబర్ట్ వేదికగా ముగిసిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన స్కాట్లాండ్.. తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.  నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ జట్టు ఓపెనర్  మున్సే (54) మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.  

అయితే మున్సేకు సహకరించే ఆటగాళ్లు కరువవడంతో  స్కాట్లాండ్ తక్కువ స్కోరుకే పరిమితమైంది. వికెట్ కీపర్ క్రాస్ (1), బెర్రింగ్టన్ (13), మెక్ లాయిడ్ (25), లీస్క్ (12) లు విఫలమయ్యారు.  

అనంతరం  స్వల్ప లక్ష్య ఛేదనలో జింబాబ్వే కూడా తడబడింది.  స్కోరుబోర్డుపై పది పరుగులు కూడా చేరకముందే ఓపెనర్ రెజిగ్ చకబ్వ (4), వెస్లీ (0) లు ఔటయ్యారు.  కానీ కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్  (54 బంతుల్లో 58, 6 ఫోర్లు),   భారత సంతతి ఆటగాడు సికందర్ రాజా (23 బంతుల్లో 40 నాటౌట్, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆదుకోవడంతో ఆ జట్టు  లక్ష్యాన్ని 18.3 ఓవర్లలో  5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.  

ఈ విజయంతో జింబాబ్వే.. గ్రూప్ - బీ నుంచి సూపర్ -12కు అర్హత సాధించింది. టీ20 ప్రపంచకప్ ప్రారంభమయ్యాక ఆ జట్టు ఈ మెగా టోర్నీకి అర్హత సాధించి  సూపర్-12కు చేరడం ఇదే ప్రథమం. 

 

క్వాలిఫై రౌండ్ లో పాల్గొన్న జట్లు :  

- గ్రూప్ - ఏ : శ్రీలంక, నెదర్లాండ్స్, నమీబియా, యూఏఈ.. వీటిలో శ్రీలంక (ఏ1), నెదర్లాండ్స్ (ఏ2) అర్హత సాధించాయి. 
- గ్రూప్ - బీ : జింబాబ్వే, ఐర్లాండ్, స్కాట్లాండ్, వెస్టిండీస్.. ఈ నాలుగు దేశాలలో జింబాబ్వే (బీ1), ఐర్లాండ్ (బీ2)  క్వాలిఫై అయ్యాయి.  

-  సూపర్ - 12 లో శ్రీలంక, ఐర్లాండ్ లు గ్రూప్-1లో చేరాయి. ఈ గ్రూప్ లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్,  అఫ్గానిస్తాన్, ఆస్ట్రేలియా ఉన్నాయి. 

- నెదర్లాండ్స్, జింబాబ్వే  గ్రూప్ - 2లోకి వచ్చాయి. ఈ  గ్రూప్ లో పాకిస్తాన్, ఇండియా, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ ఉన్నాయి. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios