భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఖాతాలో మరో టైటిల్ చేరింది. ఆదివారం జరిగిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్‌ 2021 ఫైనల్‌లో ఇండియా లెజెండ్స్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో కలిపి యువరాజ్ సింగ్ గెలిచిన టైటిల్స్ సంఖ్య తొమ్మిదికి చేరింది.

అండర్ 15 వరల్డ్‌కప్, అండర్ 19 వరల్డ్‌కప్ నుంచి టీ20 వరల్డ్‌కప్, వన్డే వరల్డ్‌కప్, ఆసియా కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్‌ గెలిచిన యువరాజ్ సింగ్, గత ఏడాది టీ10 లీగ్ టైటిల్ గెలిచిన జట్టులో భాగంగా ఉన్నాడు.

రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2021‌లో మునుపటి యువరాజ్‌ను చూసే అదృష్టం టీమిండియా అభిమానులకు దక్కినా, అతను టీ10 టోర్నీలో పాల్గొనడంతో రీఎంట్రీ ఇవ్వాలనే యువీ విన్నపాన్ని బీసీసీఐ తిరస్కరించింది.