ప్రతీ క్రీడాకారుడి జీవితంలో ఇలాంటి ఫేజ్ సర్వసాధారణం.. అవకాశాలు ఇచ్చి ప్రోత్సహిస్తే, సూర్యకుమార్ యాదవ్... వన్డే వరల్డ్ కప్‌లో కీ ప్లేయర్ అవుతాడు! సూర్యకి మద్ధతుగా యువరాజ్ సింగ్ ట్వీట్..
టీ20ల్లో నెం.1 బ్యాటర్‌గా రికార్డుల దుమ్ము దులుపుతున్న సూర్యకుమార్ యాదవ్, వన్డే ఫార్మాట్‌లో మాత్రం ఆకట్టుకోలేకపోతున్నాడు. శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా టీమ్‌కి దూరం కావడంతో అతని ప్లేస్‌లో సూర్యకుమార్ యాదవ్‌కి వరుస అవకాశాలు ఇచ్చింది టీమిండియా...
న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, ఆ తర్వాత నాగ్‌పూర్ టెస్టులోనూ ఆడాడు. ఇప్పుడు ఈ నాలుగు మ్యాచుల్లోనూ సూర్య తాపం తప్ప, ‘ప్రతాపం’ కనిపించలేదు.
నాలుగో టెస్టులో గాయపడిన శ్రేయాస్ అయ్యర్, వన్డే సిరీస్‌కి దూరం కావడంతో సూర్యకి మరో ఛాన్స్ దక్కింది. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో మూడు వన్డేల్లోనూ గోల్డెన్ డకౌట్ అయ్యాడు సూర్యకుమార్ యాదవ్..
టీమిండియా తరుపున వరుసగా మూడు మ్యాచుల్లోనూ డకౌట్ అయన ప్లేయర్లు ఆరుగురు ఉన్నా, మూడు మ్యాచుల్లోనూ మొదటి బంతికే పెవిలియన్ చేరిన చెత్త రికార్డు మాత్రం సూర్య ఖాతాలోనే చేరింది. అదీకాక ఒకే వన్డే సిరీస్‌లో మూడు సార్లు డకౌట్ అయిన భారత ప్లేయర్‌గానూ రికార్డు సృష్టించాడు సూర్యకుమార్ యాదవ్..
ఇన్ని చెత్త రికార్డులు రావడంతో సూర్యకుమార్ యాదవ్ స్థానంలో సంజూ శాంసన్‌ని ఆడించాలని డిమాండ్ చేస్తున్నారు అభిమానులు. వన్డేల్లో గత ఏడాది మంచి రికార్డు క్రియేట్ చేశాడు సంజూ శాంసన్. అయితే అతన్ని మెల్లిగా సైడ్ చేసేసింది టీమిండియా...
కొందరు సంజూ శాంసన్‌కి అవకాశం ఇవ్వాలని అంటుంటే, మరికొందరు రాహుల్ త్రిపాఠిని ఆడించాలని అంటున్నారు. అయితే భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ మాత్రం సూర్యకుమార్ యాదవ్‌కి మరిన్ని అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలని అంటున్నాడు...
‘ప్రతీ క్రీడాకారుడి జీవితంలో ఎత్తు పల్లాలు సర్వసాధారణం. మనం అందరం ఏదో ఒక సమయంలో ఇలాంటివి అనుభవించాం. నేను ఇప్పటికీ సూర్యకుమార్ యాదవ్, టీమిండియాకి కీ ప్లేయర్ అవుతాడని నమ్ముతున్నా.. అతను వచ్చే వరల్డ్ కప్‌లో తన రోల్‌ని అద్భుతంగా పోషిస్తాడు. అయితే అతనికి మరిన్ని అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించాలి. మన ప్లేయర్లకు మనమే అండగా నిలవాలి.. ఎందుకంటే సూర్య మళ్లీ ఉదయిస్తాడు...’ అంటూ ట్వీట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్..
వరుసగా మూడు డకౌట్లు నమోదు చేసిన సూర్యకుమార్ యాదవ్, ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరుపున ఎలా ఆడతాడేనేది ఆసక్తికరంగా మారింది. ఐపీఎల్‌లో మంచి పర్ఫామెన్స్ ఇస్తే, అతనికి వన్డే ఫార్మాట్‌లో మరిన్ని అవకాశాలు దక్కినా దక్కొచ్చు...
ఆస్ట్రేలియాతో తొలి వన్డేలో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో మొదటి బంతికే ఎల్బీడబ్ల్యూగా అవుటైన సూర్యకుమార్ యాదవ్, రెండో వన్డేలోనూ అదే సీన్ కాపీ పేస్ట్ చేశాడు... స్టార్క్ బౌలింగ్‌లో మొదటి బంతికే ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. గత రెండు వన్డేల్లో ఫెయిల్ అయిన సూర్యకుమార్ యాదవ్‌ని మూడో వన్డేలో బ్యాటింగ్ ఆర్డర్‌లో కిందకి జరిపింది టీమిండియా మేనేజ్‌మెంట్...
తొలి రెండు వన్డేల్లో శ్రేయాస్ అయ్యర్ ప్లేస్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చిన సూర్యకుమార్ యాదవ్, సిరీస్ నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చాడు. మొదటి రెండు మ్యాచుల్లో ఆసీస్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో మొదటి బంతికే గోల్డెన్ డకౌట్ అయిన సూర్యకుమార్ యాదవ్, మూడో వన్డేలో ఆసీస్ స్పిన్నర్ అస్టన్ అగర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు...
