మిస్టరీ ఉమెన్‌తో యువరాజ్ సింగ్... ఎన్ని షాట్స్ ఇస్తావంటూ కామెంట్! ఆడుకుంటున్న క్రికెట్ ఫ్యాన్స్...
‘ది ఓపెన్’ గోల్ఫ్ టోర్నీ ఆరంభ వేడుకకు హాజరైన భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్... హాలీవుడ్ నటి క్యాథరిన్ న్యూటన్‌తో దిగిన ఫోటోను షేర్ చేస్తూ క్రేజీ కామెంట్..

కెరీర్ పీక్ స్టేజీలో క్యాన్సర్ బారిన పడినా, దాన్ని ఓడించి, క్రికెటర్‌గా గెలిచాడు యువరాజ్ సింగ్. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్, 2017 తర్వాత అంతర్జాతీయ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. రెండేళ్ల పాటు టీమ్‌లో చోటు కోసం ఆశగా ఎదురుచూసిన యువీ, 2019లో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు..
బాలీవుడ్ హీరోయిన్ హజెల్ కీచ్‌ని వివాహం చేసుకున్న యువరాజ్ సింగ్, పెళ్లికి ముందు కిమ్ శర్మ, దీపికా పదుకొనే, రియా సేన్, ప్రీతి జింటా వంటి బాలీవుడ్ హీరోయిన్లతో ప్రేమాయణం నడిపించాడు. ‘ఖడ్గం’ సినిమాలో ‘ముసుగు వేయొద్దు మనసు మీద’ పాటతో కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన కిమ్ శర్మను యువరాజ్ సింగ్ పెళ్లాడబోతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. తాము డేటింగ్‌లో ఉన్నట్టు కిమ్ శర్మ, యువరాజ్ సింగ్ కూడా ప్రకటించారు.
అయితే పెళ్లి దాకా వచ్చిన వీరి ప్రేమ వ్యవహారం... ఏమైందో ఏమో కానీ మధ్యలోనే ఆగిపోయింది. కిమ్ శర్మ ప్రస్తుతం భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్‌తో ఢేటింగ్‌లో ఉంది. ఈ ఇద్దరూ లేటు వయసులో గోవాలో షికార్లు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు..
ఇది పక్కనబెడితే పెళ్లి చేసుకుని, భార్య పిల్లలతో సంతోషంగా గడుపుతున్న యువరాజ్ సింగ్, తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ పోస్ట్... సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఓ అందమైన యువతితో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టా స్టేటస్‌లో పెట్టిన యువరాజ్ సింగ్.. ‘ఈరోజు నువ్వు నాకు ఎన్ని షాట్స్ ఇవ్వబోతున్నావు’ అంటూ ఆమె అకౌంట్‌ని ట్యాగ్ చేశాడు..
ఆమె ఎవరో కాదు, అమెరికన్ నటి క్యాథరిన్ న్యూటన్. సూపర్ హాట్ లుక్స్‌తో కళ్లతోనే మనసులు కొల్లగొట్టే క్యాథరిన్ న్యూటన్, ‘ది ఓపెన్’ గోల్ఫ్ టోర్నీ ఆరంభ వేడుకకు హాజరైంది. ఇదే వేడుక కోసం స్కాట్లాండ్‌కి వెళ్లిన యువరాజ్ సింగ్, ఆమెతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు..
‘బ్యాడ్ టీచర్’, ‘లేడీ బర్డ్’, ‘ఫ్రీకీ’, ‘ది మార్షల్ ఆర్ట్స్ కిడ్’, ‘పారానార్మల్ యాక్టివిటీ 4’, ‘యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్’ వంటి సినిమాల్లో నటించిన క్యాథరిన్ న్యూటన్‌కి సోషల్ మీడియాలో 2 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు..
అయితే ‘ఎన్ని షాట్స్ ఇస్తావ్’ అనే వ్యాక్యాన్ని యువరాజ్ సింగ్ ఏ ఉద్దేశంతో వాడాడో తెలియక అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. యువీ బూతు అర్థం వచ్చేలా షాట్స్ పదాన్ని వాడాడని కొందరు అంటుంటే, క్యాథరిన్ న్యూటన్ నటించిన ‘యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్’ సినిమాలో ఓ సీన్ గురించి యువీ ఇలా కామెంట్స్ చేసి ఉండవచ్చని మరికొందరు అంటున్నారు..
ఈ సినిమాలో కొత్త భాషలు నేర్చుకునేందుకు ఓ రకమైన ద్రవణాన్ని షాట్స్‌గా ఇస్తారు. దాన్ని తాగిన వెంటనే చీమలు, కీటకాల భాష కూడా అర్థమైపోతూ ఉంటుంది. యువరాజ్ వాడిన షాట్స్ పదం దీని గురించే అయ్యి ఉండవచ్చని అంటున్నారు యువీ ఫ్యాన్స్..