బౌలింగ్ చేయడంలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. బుమ్రా వేసే బౌలింగ్ యాక్షన్‌కీ, మలింగ్ వేసే బౌలింగ్‌కీ చాలా తేడా ఉంటుంది. హర్భజన్ సింగ్, ముత్తయ్య మురళీధరన్ మణికట్టుతో చేసే స్పిన్ మ్యాజిక్ మరో తీరు. అయితే గింగిరాలు తిరుగుతూ, భరత నాట్యం చేస్తూ బౌలింగ్ చేయడం ఎప్పుడైనా చూశారా?

అలాంటి ఓ విభిన్నమైన బౌలింగ్ యాక్షన్‌ను ప్రేక్షకులతో పంచుకున్నాడు భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్. ‘భరతనాట్యం స్టైల్ ఆఫ్ స్పిన్... నువ్వేమంటావ్ భజ్జీ...’ అంటూ హర్భజన్ సింగ్‌ను ట్యాగ్ చేశాడు.

ఈ వీడియోలో బౌలర్ బంతిని గింగిరాలు తిప్పే బదులుగా, తానే గింగిరాలు తిరుగుతూ బౌలింగ్ చేస్తాడు. ఈ ఫన్నీ బౌలింగ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

 

గత ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్ సింగ్, క్రికెట్‌లో రీఎంట్రీ ఇవ్వాలని భావించాడు. అయితే విదేశీ లీగ్‌ల్లో పాల్గొనడంతో యువరాజ్ సింగ్‌ రిటైర్మెంట్ వెనక్కి తీసుకునేందుకు బీసీసీఐ నిరాకరించింది.