Asianet News TeluguAsianet News Telugu

కులం పేరిట చాహల్ పై యూవీ కామెంట్స్.. నెటిజన్ల ఫైర్

టిక్‌టాక్‌లో చాహల్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి వీడియోలు పోస్ట్‌ చేస్తున్నాడని, వీళ్లకేం పనిలేదంటూ వాల్మీకి సమాజాన్ని కించపరిచేలా యువీ వ్యాఖ్య చేశాడు.  దీంతో నెటిజన్లు మండిపడుతున్నారు.

Yuvraj singh maafi maango trends on twitter  after former india star's viseo clip with alleged casteist rem
Author
Hyderabad, First Published Jun 4, 2020, 12:01 PM IST

టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ కి పెద్ద చిక్కు వచ్చి పడింది. యూవీపై నెటిజన్లు విపరీతంగా మండిపడుతున్నారు. చాహల్ కి క్షమాపణలు చెప్పాలంటూ సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా యూవీని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. చాహల్ ని యూవీ సరాదాగా అన్న కామెంట్స్ ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.

ఇంతకీ మ్యాటరేంటంటే.. చాహల్ సరదాగా టిక్ టాక్స్ చేస్తాడన్న విషయం తెలిసిందే. ఒకసారి తన ఫ్యామిలీతో కలిసి చాహల్ టిక్ టాక్ వీడియోలు చేశాడు. కాగా..దానికి యువరాజ్ సింగ్ చేసిన కామెంట్ ఇప్పుడు వివాదాస్పదమైంది. నిజానికి ఈ వీడియో పాతదే అయినా ఇప్పుడు వైరల్‌గా మారింది. 

టిక్‌టాక్‌లో చాహల్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి వీడియోలు పోస్ట్‌ చేస్తున్నాడని, వీళ్లకేం పనిలేదంటూ వాల్మీకి సమాజాన్ని కించపరిచేలా యువీ వ్యాఖ్య చేశాడు.  దీంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక కులాన్ని ఉద్దేశిస్తూ కామెంట్‌ చేస్తావా అంటూ యువీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక కులం పేరుతో యువరాజ్‌ కామెంట్‌ చేయడం నిజంగా సిగ్గు చేటని సోషల్‌ మీడియా హోరెత్తుతోంది. 

ఏ పరిస్థితుల్లోనైనా మతాన్ని, కులాన్ని, జాతిని, వర్ణాన్ని ఉద్దేశించి మాట్లాడటం అవతలి వాళ్లను కించపరచడమేనంటూ విమర్శలు వర్షం కురుస్తోంది. ఈ క్రమంలోనే యువరాజ్‌ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. ‘యువరాజ్‌ సింగ్‌ మాఫీ మాంగో’(యువరాజ్‌ క్షమాపణలు చెప్పాలి) పేరుతో ట్వీటర్‌లో ట్రెండ్‌ చేస్తున్నారు. మరి దీనికి యూవీ, చాహల్ ఎలా సమాధానం చెబుతారో చూడాలి.

ఇలా యువరాజ్‌ సింగ్‌ సోషల్‌ మీడియాలో విమర్శలకు గురికావడం తొలిసారేమీ కాదు. గతంలో పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది ఫౌండేషన్‌కు మద్దతు ప్రకటించిన క్రమంలో కూడా యువీ విమర్శలను చవిచూశాడు. ఒక పాకిస్తాన్‌ క్రికెటర్‌కు ఎలా సపోర్ట్‌ చేస్తావంటూ నెటిజన్లు విమర్శలు చేయగా, మానవతా కోణంలో చేయడంలో తప్పేముందని యువీ సమర్ధించుకున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios