న్యూఢిల్లీ: వెస్టిండీస్ తో హైదరాబాదులో శుక్రవారం జరిగిన ట్వంటీ20 మ్యాచులో టీమిండియా ఫీల్డింగ్ పై మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీమిండియా ఫీల్డింగ్ చెత్తగా ఉందని ఆయన విమర్శించారు. యువ ఆటగాళ్లు చురుగ్గా కదలడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. 

బంతిని అందుకోవడంలో యువ ఆటగాళ్లు ఆలస్యంగా స్పందించారని, ఎక్కవ మ్యాచులు ఆడడం వల్ల ఫీల్డింగ్ చేయలేకపోతున్నారా అని ఆయన ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యలు చేశారు. 

 

వాషింగ్టన్ సుందర్, రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ లోత పాటు విరాట్ కోహ్లీ కూడా ఫీల్డింగ్ సరిగా చేయకపోవడంతో వెస్టిండీస్ భారీ స్కోరు చేసింది. 16వ ఓవరులో హెట్ మెయిర్ ఇచ్చిన క్యాచ్ ను వాషింగ్టన్ సుందర్ జారవిడిచాడు దీంతో హెట్ మొయిర్ తన తొలి అర్థ సెంచరీ సాధించాడు. 

కీరన్ పోలార్డ్ ఇచ్చిన క్యాచ్ ను రోహిత్ శర్మ అందుకోలేకపోయాడు. చాహహర్ వేసిన 17వ ఓవరులో ఏకంగా మూడు క్యాచ్ లు జారవిడిచాడు. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచులో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ విరాట్ కోహ్లీ ఒంటి చేత్తో మ్యాచును గెలిపించాడు.