ఫీల్డ్ అంపైర్ల తప్పిదం మరోసారి బయటపడింది. అంపైర్ తప్పుడు నిర్ణయం కారణంగా... ఈ మధ్యకాలంలో క్రికెటర్లు బలౌతున్న సంగతి తెలిసిందే. కాగా... తాజాగా అలాంటి సంఘటనే రంజీ ట్రోఫీలో చోటుచేసుకుంది.

ఇంతకీ మ్యాటరేంటంటే... రంజీ ట్రోఫీలో భాగంగా ముంబయి, బరోడా జట్ల మధ్య గురువారం మ్యాచ్ జరిగింది. కాగా..... ఈ మ్యాచ్ లో ముంబయి 533 పరుగులు చేసింది. ఆ పరుగులను చేధించేందుకు బరోడా బరిలోకి దిగింది. అయితే 169 పరుగలకే ఐదు వికెట్లు కోల్పోవడంతో జట్టు కష్టాల్లో పడింది.

ఈ సమయంలో దీపక్ హుడాతో కలిసి యూసూఫ్ పఠాన్ బరోడా ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశాడు. 48వ ఓవర్ లో ముంబయి స్పిన్నర్ శశాంక్ వేసిన బాల్ ని యూసూఫ్ ఫఠాన్ డిఫెన్స్ ఆడాడు. ఆ బంతి బౌన్స్ తీసుకొని పఠాన్ ఛాతికి తగిలి గాల్లో లేచింది. 

ఆ బంతిని షార్ట్ లెగ్ వద్ద ఉన్న ఫీల్డర్ జై బిస్టా అందుకున్నాడు. దీంతో ముంబయి జట్టు అవుట్ కి అప్పీల్ చేసింది. కాసేపు ఆలోచించిన అంపైర్ ఔట్ ఇచ్చాడు. అయితే... పఠాన్ మాత్రం తాను ఔట్ కాలేదంటూ బీష్మించుకు కూర్చున్నాడు. క్రీజు వదలకుండా అక్కడే ఉండటంతో విషయం సీరియస్ అయ్యింది. ఈ క్రమంలో ముంబయి కెప్టెన్ రహానే కి, యూసూఫ్ పఠాన్ కి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

వివాదం మరింత పెద్దది కావడంతో..పఠాన్ క్రీజు వదిలి వెళ్లిపోవాల్సి వచ్చింది. అయితే... ఈ వివాదానికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో బరోడీ కేవలం 224 పరుగులు మాత్రమే చేయగలిగింది. 309 భారీ పరుగుల తేడాతో ఓటమిపాలయ్యింది.