కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ వైరస్ భారత్ లోనూ విలయతాండవం చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ నడుస్తోంది. ఈ కరోనా వైరస్ తో క్రీడా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడ జరగాల్సిన అన్ని క్రీడలు ఆగిపోయాయి.

దీంతో క్రీడాకారులంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లోనే కుటుంబసభ్యులతో గుడుపుతూ కాలక్షేపం చేస్తున్నారు. కాగా.. లాక్ డౌన్ సడలింపులతో మరి కొద్ది రోజుల్లోనే ఐపీఎల్ 2020 పట్టాలెక్కే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఐపీఎల్ ఆటగాళ్లంతా సోషల్ మీడియా వేదికగా అభిమానులను అలరిస్తున్నారు. తాజాగా.. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఆటగాళ్లు దినేష్ కార్తీక్, ఆండ్రీ రసూల్, సునీల్ నరైన్ లు సోషల్ మీడియాలో ఫన్నీ చాట్ చేసుకున్నారు. వీరి వీడియోని కేకేఆర్ టీం.. తమ అధికారిక ట్విట్టర్ లో షేర్ చేయగా.. ఇప్పుడు ఇది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

కాగా... ఈ వీడియో చాట్ లో.. రసూల్.. దినేష్ కార్తీక్ న్యూలుక్ పై ఫన్నీ కామెంట్స్ చేశారు. ఈ లాక్ డౌన్ వేళ దినేష్ కార్తీక్ న్యూలుక్ ట్రై చేశాడు. గడ్డం బాగా పెంచి కనిపించాడు. కాగా.. అతని లుక్ ని వెంటనే రసూల్ ట్రోల్ చేయడం గమనార్హం.

 

‘‘ కార్తీక్.. మీ బార్బర్ కి ఏమైంది..? కొంపదీసి మీ బార్బర్ చనిపోయాడా’’ అంటూ ఫన్నీ కామెంట్స్ వేశాడు. కార్తీక్ గడ్డం గీసుకోలేదని.. అతను అలా అనడం గమనార్హం.

ఇదిలా ఉండగా.. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 2020 వాయిదా పడగా.. దీనిపై గతంలోనే ఆండ్రీ రసూల్ స్పందించాడు. 2020 ఐపీఎల్‌‌ ఈ ఏడాదిలో ఏదో ఒక టైమ్‌‌లో జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

ఐపీఎల్‌‌లో తన చివరి మ్యాచ్‌‌ వరకు కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌తోనే ఉండాలని అనుకుంటున్నట్టు వెస్టిండీస్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ ఆండ్రీ రసెల్‌‌ చెప్పాడు. నైట్‌‌రైడర్స్‌‌కు ఆడిన ప్రతీ మ్యాచ్‌‌ను ఎంజాయ్‌‌ చేసినట్టు తెలిపాడు. 

‘ఐపీఎల్‌‌, సీపీఎల్‌‌ (కరీబియన్‌‌ ప్రీమియర్‌‌ లీగ్‌‌)లోనూ చాలాసార్లు ఉత్కంఠకు గురయ్యా. కానీ ఐపీఎల్‌‌కు వచ్చేసరికి ముఖ్యంగా ఈడెన్‌‌గార్డెన్స్‌‌లో ఆడిన మ్యాచ్‌‌లను వేరే వాటితో పోల్చలేం. ఈడెన్‌‌లో లభించే స్వాగతం, ఫ్యాన్స్‌‌ చూపించే ప్రేమ చాలా ఒత్తిడి పెంచుతుంది. అయితే అది చాలా పాజిటివ్‌‌ ప్రెజర్‌‌. లీగ్‌‌లో ఉన్నంతకాలం నైట్‌‌రైడర్స్‌‌కే  ఆడాలని ఆశిస్తున్నా. కేకేఆర్‌‌తో ఇప్పటిదాకా ఆరు సీజన్లలో ఉన్నా అన్నింటిని బాగా ఎంజాయ్‌‌ చేశా. వరుసగా రెండు మ్యాచ్‌‌ల్లో ఫెయిలైనా, తర్వాతి గేమ్‌‌లో కోల్‌‌కతా ఫ్యాన్స్‌‌ రిస్పెషన్‌‌లో ఎలాంటి తేడా ఉండదు’ అని రసెల్‌‌ చెప్పాడు.