టీమిండియా యువ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహాపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు.
టీమిండియా వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహాపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించారు. రిషబ్ పంత్ తో పోలిస్తే అతడు చాలా మంచి వికెట్ కీపర్ అని అన్నాడు. కెప్టెన్ కోహ్లీకి కూడా వికెట్ కీపర్ గా సాహాపైనే ఎక్కువ నమ్మకముందన్నారు. అందువల్లే దక్షిణాఫ్రికా తో జరుగుతున్న టెస్ట్ సీరిస్ లో పంత్ ను కాదని మరీ సాహాకు అవకాశమిచ్చాడని గంగూలీ పేర్కొన్నాడు.
''సాహా ఓ బెంగాలీ ఆటగాడు. కాబట్టి అతడికి నాలాంటి బెంగాలీ సీనియర్లు మద్దతుగా నిలవాల్సిందే. కాబట్టి రిషబ్ కంటే సాహా అత్యుత్తమ వికెట్ కీపర్ అయ్యాడు. సాహా తన ఫామ్ ను అందిపుచ్చుకుని ఇకపైన బ్యాటింగ్ లోనూ రాణించాలని కోరుకుంటున్నాను. '' అంటూ గంగూలీ సొంతరాష్ట్రానికి చెందిన యువ ఆటగాడికి మద్దతుగా నిలిచాడు.
వైజాగ్ టెస్ట్ లో అదరగొట్టిన భారత ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, రోహిత్ శర్మలపై కూడా గంగూలీ ప్రశంసించాడు. యువ ఓపెనర్ మయాంక్ అద్భుతమైన ఓపెనింగ్ స్కిల్స్ వున్న ఆటగాడని అన్నాడు. అతడు దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని డబుల్ సెంచరీ సాధించడమే అతడి ప్రతిభకు నిదర్శనం. అయితే ఇప్పుడే అతడి ఆటపై ఓ అంచనాకు రాలేమన్నారు. మరికొంతకాలం ఇదే ఫామ్ ను కొనసాగిస్తే గానీ మయాంక్ ఆటపై అందరికీ ఓ నమ్మకం వస్తుందని గంగూలీ పేర్కొన్నారు.
ఇక తొలిసారి టెస్టుల్లో ఓపెనింగ్ చేసిన రోహిత్ ఈ ఫార్మాట్ లో కూడా ఓపెనర్ గా స్థిరపడిపోతాడని అన్నారు. ఈ ఫామ్ ను ఇలాగే కొనసాగిస్తాడన్న నమ్మకముందని గంగూలీ అభిప్రాయపడ్డాడు.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Oct 5, 2019, 8:21 AM IST