హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ యువ క్రికెటర్లకు చుక్కలు చూపించింది. అండర్ 16 బాయ్స్ సెలక్షన్స్‌కు వందలాది మంది క్రికెటర్లు తరలిరావడంతో వీరందరికి సౌకర్యాలు కల్పించలేక హెచ్‌సీఏ చేతులెత్తేసింది.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ యువ క్రికెటర్లకు చుక్కలు చూపించింది. వివరాల్లోకి వెళితే.. ఉప్పల్ స్టేడియంలో మూడు రోజుల పాటు అండర్ 16 బాయ్స్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి వందల మంది పోటెత్తారు. దీనికి తోడు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ప్లేయర్స్‌ను పిలవడంతో హెచ్‌సీఏ వారిని వెనక్కి పంపింది.
అన్ని జిల్లాల నుంచి ఒకేసారి వందలాది ఆటగాళ్లు రావడంతో హెచ్‌సీఏ చేతులెత్తేసింది. వీంతో కుర్రాళ్లు తీవ్ర అవస్థలు పడ్డారు. ఉదయం నుంచి వందల మంది ఆటగాళ్లు స్టేడియం బయటే పడిగాపులు కాస్తున్నారు. వీరి వెంట వారి తల్లిదండ్రులు కూడా రావడంతో వారు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హెచ్‌సీఏ నిర్వహణ సరిగా లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలావుండగా.. సుప్రీంకోర్టు నియమించిన రిటైర్డ్ జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు .. హెచ్‌సీఏలో ప్రక్షాళన చేపట్టారు. దీనిలో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా వున్న 57 క్రికెట్ క్లబ్బులపై చర్యలు తీసుకున్నారు. తదుపరి ఎన్నికల్లో పోటీ చేయకుండా వాటిపై నిషేధం విధించారు. క్లబ్బుల ప్రతినిధుల నుంచి వివరణ తీసుకున్న అనంతరం నిన్న జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు.
