న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు తరపున ఆడుతున్న ఆటగాళ్లు యోయో పరీక్షను నివారించడానికి మార్గం లేకుండా పోయింది. కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి లు ఈ విషయంలో పట్టుదలగా ఉన్నారు. యోయో టెస్టులో ఉత్తీర్ణత సాధిస్తేనే జాతీయ జట్టులోకి స్థానం లభిస్తోంది.

పుట్ బాల్ ఆటగాళ్ల కోసం డానిష్ ఆటగాడు జువెంటస్ అసిస్టెంట్ కోచ్ జెన్స్ బ్యాంగ్సో   యోయో టెస్టును ప్రతిపాదించాడు. అయితే ఈ టెస్టును భారత క్రికెట్ జట్టులో క్రీడాకారుల కోసం ప్రవేశపెట్టింది భారత జట్టు మాజీ కోచ్ అనిల్ కుంబ్లే.ఒక వ్యక్తి (ఆటగాడు) ఏరోబిక్ ఫిట్ నెస్ ను అంచనా వేసేందుకు ఈ పరీక్ష దోహదపడుతోంది.

భారత క్రికెట్ జట్టు క్రమం తప్పకుండా వరుస ఫిట్ నెస్ పరీక్షలు నిర్వహిస్తోంది. యోయో టెస్టులను బీసీసీఐ ఒక్కటే కాదు అస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు కూడ ఈ పరీక్షలు నిర్వహించి ఆటగాళ్ల ఫిట్ నెస్ ను విశ్లేషిస్తాయి.

యోయో పరీక్షల్లో రెండు వెర్షన్లుంటాయి. ప్రారంభకులకు ఫస్ట్, అడ్వాన్స్ టెస్ట్ ను రెండోదిగా పిలుస్తారరు.
రెండో ఫిట్ నెస్ టెస్టులో 20 మీటర్ల దూరంలో ఆటగాళ్లు పరుగెత్తాలి. అయితే ఆటగాళ్లు పరుగెత్తే సమయంలో బీప్ శబ్దం వచ్చిన సమయంలో ఆటగాళ్లు వెనక్కి పరుగెత్తాల్సి ఉంటుంది.

ప్రతి నిమిషం తర్వాత  బీప్ లు త్వర త్వరగా వస్తాయి. ఆ సమయానికి ఆటగాళ్లు నిర్ణీత సరిహద్దును చేరుకోవాలి. ఒక వేళ అలా చేరుకోకపోతే మరో రెండు బీప్ శబ్దాల లోపుగా వారు తమ లక్ష్యానికి చేరుకోవాల్సి ఉంటుంది.

ఈ ప్రక్రియ అంతా సాఫ్ట్ వేర్ ఆధారంగా నిర్వహిస్తారు. ఇదే పరీక్ష పుట్ బాల్, హాకీ ఆటగాళ్లకు నిర్వహిస్తే విభిన్న ఫలితాలను ఇస్తోంది. 

యోయో పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడానికి బీసీసీఐ  19.5 స్కోరుగా నిర్ణయించింది. యువరాజ్ సింగ్ మాత్రం 16 పరుగులు సాధించినట్టుగా తెలిసింది. విరాట్ కోహ్లీ, మనీష్ పాండేలు 19, 19.2 స్కోర్ ను సాధించారు.

ఇండియా యోయో స్కోర్ ను 16.1 వద్ద నిర్ణయించింది. ఇంగ్లాండ్ న్యూజిలాండ్తమ యోయో స్కోర్ ను 19 పాయింట్లు గా నిర్ణయించింది. నాలుగేళ్ల క్రితం అస్ట్రేలియా దీన్ని వదులుకొంది. దక్షిణాఫ్రికా 18.5, శ్రీలంక 17.4, పాకిస్తాన్ 174. గా నిర్ణయించినట్టుగా ఓ పత్రిక కథనం ప్రకారం తెలుస్తోంది.