Asianet News TeluguAsianet News Telugu

WTC Final 2023: స్మిత్ సెంచరీ.. టీమిండియాకు బ్రేక్ ఇచ్చిన సిరాజ్.. హెడ్ ఔట్

WTC Final 2023: భారత్ - ఆస్ట్రేలియా మధ్య  ఓవల్ లో  జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ లో ఆసీస్ భారీ స్కోరుపై కన్నేసింది.

WTC Final 2023: Day 2 Starts with Steven Smith Century, Australia Eye on  Big Score MSV
Author
First Published Jun 8, 2023, 3:24 PM IST

భారత్ - ఆస్ట్రేలియా మధ్య  కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా  జరుగుతున్న  ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్  ఫైనల్  లో ఆసీస్ భారీ స్కోరు మీద కన్నేసింది. 327-3 వద్ద  రెండో రోజు ఆట ఆరంభించిన  ఆస్ట్రేలియా.. అదే దూకుడు కొనసాగిస్తోంది.  95 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో  బ్యాటింగ్ కు వచ్చిన స్మిత్.. సిరాజ్ వేసిన ఫస్ట్ ఓవర్ (ఇన్నింగ్స్‌లో 86)  లోనే రెండు ఫోర్లు బాది  సెంచరీ పూర్తి చేశాడు. 

స్మిత్‌కు ఇది  కెరీర్ లో 31వ సెంచరీ. తద్వారా  అతడు ఆస్ట్రేలియా తరఫున  అత్యధిక సెంచరీలు చేసిన మాథ్యూ హెడెన్ (31)ను దాటేశాడు.  స్మిత్ కంటే ముంందు   స్టీవ్ వా (32), రికీ పాంటింగ్ (41) లు టాప్-2లో ఉన్నారు. 

స్మిత్ కు ఇది ఇంగ్లాండ్ లో ఏడో సెంచరీ కావడం విశేషం. భారత్ పై 9వ టెస్టు సెంచరీ.  దీంతో అతడు వివిన్ రిచర్డ్స్, రికీ పాంటింగ్ (భారత్ పై 8 సెంచరీలు) ల రికార్డును బ్రేక్ చేశాడు.  ఇంగ్లాండ్ మాజీ సారథి  జో రూట్  కూడా భారత్ పై 9 సెంచరీలు చేశాడు.  

టీమిండియాకు బ్రేక్ ఇచ్చిన సిరాజ్ 

ఇక నిన్ననే సెంచరీ చేసిన ట్రావిస్ హెడ్..  నేడు షమీ వేసిన 88వ ఓవర్లో  రెండో బంతికి ఫోర్ కొట్టి  150 పరుగులు  పూర్తిచేసుకున్నాడు. అయితే  నిన్నటి మాదిరిగానే దూకుడుగా ఆడిన  హెడ్ ను సిరాజ్ బోల్తా కట్టించాడు. సిరాజ్ వేసిన  92వ ఓవర్లో  హెడ్ వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో స్మిత్ తో కలిసి  హెడ్ నెలకొల్పిన 285 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.  ప్రస్తుతం కామెరూన్ గ్రీన్.. స్మిత్ తో కలిసి ఆడుతున్నాడు. ఆ తర్వాాత అలెక్స్ క్యారీ, స్టార్క్, కమిన్స్  రూపంలో  ఆసీస్ కు   లోయరార్డర్ కూడా బ్యాటింగ్ చేయగల సత్తా ఉండటంతో ఆ జట్టు భారీ స్కోరుపై కన్నేసింది.  భారత బౌలర్లు శ్రమిస్తే తప్ప  రోహిత్ సేనకు తిప్పలు తప్పవు. ప్రస్తుతం 92 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా.. 4 వికెట్ల నస్టానికి 367 పరుగులు చేసింది.  స్మిత్ (110 నాటౌట్), గ్రీన్ (6 నాటౌట్) క్రీజులో ఉన్నారు. 

 


తొలిరోజు 2 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా. ఆ తర్వాత డేవిడ్ వార్నర్, మార్నస్ లబుషేన్ కలిసి రెండో వికెట్‌కి 69 పరుగుల భాగస్వామ్యం జోడించారు. శార్దూల్ ఠాకూర్ ఓవర్‌లో 4 ఫోర్లు బాది 16 పరుగులు రాబట్టిన డేవిడ్ వార్నర్, హాఫ్ సెంచరీ ముందు అవుట్ అయ్యాడు. 60 బంతుల్లో 8 ఫోర్లతో 43 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో శ్రీకర్ భరత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

లంచ్ బ్రేక్ సమయానికి 2 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. లంచ్ బ్రేక్ తర్వాత వస్తూనే లబుషేన్‌ని అవుట్ చేశాడు మహ్మద్ షమీ. 62 బంతుల్లో 3 ఫోర్లతో 26 పరుగులు చేసిన మార్నస్ లబుషేన్, మహ్మద్ షమీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. ఐదో స్థానంలో వచ్చిన ట్రావిస్ హెడ్, వస్తూనే వన్డే స్టైల్‌లో బౌండరీలు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 60 బంతుల్లో 9 ఫోర్లతో హాఫ్ సెంచరీ అందుకున్న ట్రావిస్ హెడ్, మరో 46 బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios