రిటైర్మెంట్ ప్రకటించిన సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ డేన్ వాన్ నీకెర్క్... ఫిట్‌నెస్ టెస్టు పాస్ కాలేదనే కారణంగా టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీ నుంచి డేన్ వాన్ నీకెర్క్‌ని తప్పించిన సెలక్టర్లు...
సౌతాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ డేన్ వాన్ నీకెర్క్, అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటూ నిర్ణయం తీసుకుంది. ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీకి ముందు సౌతాఫ్రికా టీమ్‌కి కెప్టెన్‌గా ఉంది డేన్ వాన్ నీకెర్క్ అయితే ఫిట్‌నెస్ టెస్టు పాస్ కాని కారణంగా ఆమె పొట్టి ప్రపంచ కప్ టీమ్ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు...
ఈ నిర్ణయం క్రికెట్ ప్రపంచంలో సంచలనం క్రియేట్ చేసింది. క్రికెట్ సౌతాఫ్రికా తీసుకొచ్చిన కొత్త ఫిట్‌నెస్ స్టాండర్డ్స్ ప్రకారం మహిళా క్రికెట్ టీమ్‌కి ఎంపిక కావాలంటే 9 నిమిషాల 30 సెకన్లలో 2 కి.మీ.ల దూరం పరుగెత్తాల్సి ఉంటుంది. ఈ ఫిట్‌నెస్ పరీక్షలో సఫారీ మహిళా టీమ్ కెప్టెన్ డేన్ వాన్ నీకెర్క్ పాస్ కాలేకపోయింది. ఈ దూరాన్ని పూర్తి చేసేందుకు నిర్ణయించిన సమయం కంటే మరో 15 సెకన్లు ఎక్కువగా తీసుకోవడంతో ఆమెను ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీ నుంచి తప్పించారు సెలక్టర్లు...
టీ20ల్లో 28.01 సగటుతో 1877 పరుగులు చేసిన డేన్ వాన్ నీకెర్క్, 10 హాఫ్ సెంచరీలు బాదింది. అలాగే బౌలింగ్‌లో 5.45 ఎకానమీతో 65 వికెట్లు పడగొట్టింది. టీ20ల్లో 1500లకు పైగా పరుగులు, 50కి పైగా వికెట్లు తీసిన ఏకైక ప్లేయర్‌గా ఉన్న డేన్ వాన్ నీకెర్క్‌ని ఎంపిక చేయకపోవడంపై సౌతాఫ్రికా టీమ్ ప్లేయర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు...
అయితే కెప్టెన్ లేకపోయినా సున్నీ లూస్ కెప్టెన్సీలో ఐసీసీ వరల్డ్ కప్ చరిత్రలో మొట్టమొదటిసారి ఫైనల్‌కి దూసుకెళ్లింది సౌతాఫ్రికా. అయితే ఫైనల్ మ్యాచ్‌లో 157 పరుగుల లక్ష్యఛేదనలో ఒత్తిడికి గురైన సఫారీ ప్లేయర్లు 19 పరుగుల దూరంలో ఆగిపోయి, రన్నరప్‌తో సరిపెట్టుకున్నారు..
సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ డేన్ వాన్ నీకెర్క్, తన సహచర ప్లేయర్ మరిజాన్నే కేప్‌ని స్వలింగ వివాహం చేసుకుంది. సౌతాఫ్రికా తరుపున టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన మొట్టమొదటి మహిళా క్రికెటర్ కేప్.. కూడా టీ20 వరల్డ్ కప్ 2023 టోర్నీకి ఎంపిక కాలేదు. ఆ సమయంలోనే ఈ ఇద్దరూ రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ వరల్డ్ కప్ ముగిసి నెల కూడా గడవకముందే అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది డేన్ వాన్ నీకెర్క్...
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2023 టోర్నీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున ఆడుతోంది డేన్ వాన్ నీనీకెర్క్. వేలంలో రూ.30 లక్షలు పెట్టి డేన్ వాన్ నీరెక్‌ని కొనుగోలు చేసింది ఆర్‌సీబీ. అయితే మొదటి నాలుగు మ్యాచుల్లోనూ రిజర్వు బెంచ్‌కే పరిమితమైంది డేన్ వాన్ నీకెర్క్. డబ్ల్యూపీఎల్‌లో మొదటి నాలుగు మ్యాచుల్లోనూ చిత్తుగా ఓడింది...
వరుస పరాజయాల నుంచి పాఠాలు నేర్చుకోని ఆర్‌సీబీ, ఒక దాని తర్వాత మరోటి దారుణ పరాజయాలను చవి చూసింది. మరి మిగిలిన మ్యాచుల్లో అయినా డేన్ వాన్ నీకెర్క్‌కి అవకాశం దక్కుతుందో లేదో చూడాలి..
