WPL 2023 Finals: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్  తొలి ఫైనల్ లో ముంబై బౌలర్  ఇసీ వాంగ్  ధాటికి  ఢిల్లీ గజగజ వణుకుతోంది.  ఐదు ఓవర్ల లోపే  ఢిల్లీ ముగ్గురు కీలక బ్యాటర్లును కోల్పోయింది. 

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి ఫైనల్ లో ముంబై బౌలర్ ఇసీ వాంగ్ ఇరగదీస్తున్నది. ఆమె ధాటికి ఢిల్లీ గజగజ వణుకుతోంది. వాంగ్ దెబ్బకు ఢిల్లీ ఐదు ఓవర్లలోనే మూడు కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. విధ్వంసకర ఓపెనర్ షఫాలీ వర్మ, అలీస్ క్యాప్సీ, జెమీమా రోడ్రిగ్స్ లు వాంగ్ దెబ్బకు పెవిలియన్ చేరారు. తాను వేసిన తొలి ఓవర్లోనే షఫాలీ, క్యాప్సీలను ఔట్ చేసిన ఇసీ.. రెండో ఓవర్లో జెమీమాకు ఝలక్ ఇచ్చింది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్.. సీవర్ వేసిన తొల ఓవర్లో రెండు పరగులే రాబట్టింది. వాంగ్ వేసిన రెండో ఓవర్లో తొలి బంతికే సిక్సర్ బాదిన షఫాలీ.. రెండో బంతికి ఫోర్ కొట్టింది.

ఆడిన నాలుగు బంతుల్లోనే 11 పరుగులు చేసిన షఫాలీ.. అదే ఓవర్లో మూడో బంతికి భారీ షాట్ ఆడబోయి కెర్ చేతికి చిక్కింది. బంతి నడుము ఎత్తులో రావడంతో ఢిల్లీ రివ్యూ కోరినా ఫలితం వారికి వ్యతిరేకంగానే వచ్చింది. ఇదే ఓవర్లో ఐదో బంతికి అలీస్ క్యాప్సీ (0) కూడా ఇదే రకమైన బంతికి బోల్తా కొట్టింది. క్యాప్సీ క్యాచ్ ను అమన్‌జ్యోత్ కౌర్ అద్భుతంగా అందుకుంది.

సీవర్ వేసిన మూడో ఓవర్లో లానింగ్ రెండు బౌండరీలు కొట్టగా రోడ్రిగ్స్ కూడా ఓ ఫోర్ కొట్టింది. కానీ మళ్లీ వాంగ్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో రెండో బంతికి రోడ్రిగ్స్.. లో ఫుల్ టాస్ ను అవుట్ సైడ్ దిశగా ఆడగా హేలీ మాథ్యూస్ క్యాచ్ అందుకుంది. దీంతో ఢిల్లీ మూడో వికెట్ కూడా కోల్పోయింది.

ప్రస్తుతం 8వ ఓవర్ ముగిసేసరికి ఢిల్లీ.. మూడు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. ముంబై బౌలర్లు విజృంభిస్తున్న వేళ కెప్టెన్ మెగ్ లానింగ్ (27 నాటౌట్), మరియనె కాప్ (6 నాటౌట్) లు నిలబడటం ఢిల్లీకి అత్యావశ్యకం. 

Scroll to load tweet…

ఈ మ్యాచ్ లో ఆడుతున్న ఇరు జట్ల వివరాలు : 
ముంబై : యస్తికా భాటియా, హేలీ మాథ్యూస్, నటాలీ సీవర్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), అమెలియా కెర్, పూజా వస్త్రకార్, ఇసీ వాంగ్, అమన్‌జ్యోత్ కౌర్, హుమైరా కాజి, జింతమణి కలిత, సైకా ఇషాక్ 

ఢిల్లీ : మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, మరియనె కాప్, అలీస్ క్యాప్సీ, జెస్ జొనాసేన్, అరుంధతి రెడ్డి, తాన్యా భాటియా, రాధా యాదవ్, శిఖా పాండే, మిన్ను మణి