Asianet News TeluguAsianet News Telugu

ప్లేఆఫ్స్ కు ముందు ప్రాక్టీస్.. లీగ్ దశ చివరి మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ఢిల్లీ

WPL 2023: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో తొలి అంకానికి  కాసేపట్లో తెరపడనుంది.   యూపీ వారియర్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగబోయే  మ్యాచ్ తో లీగ్ దశ పోటీలు ముగుస్తాయి.  

WPL 2023: Delhi Capitals Won The Toss And Elects Bowl First Against UP Warriorz MSV
Author
First Published Mar 21, 2023, 7:02 PM IST

డబ్ల్యూపీఎల్ లో  అగ్రస్థానంలో ఉన్న  ఢిల్లీ క్యాపిటల్స్..  ప్లేఆఫ్స్ కు అర్హత సాధించిన  యూపీ వారియర్స్ తో  నేడు  అప్రధాన   పోటీలో  తలపడుతోంది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా మార్చి 4 నుంచి మొదలైన లీగ్ దశ మ్యాచ్ లకు నేటితో ముగింపు పడనున్నది.   కాగా  ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.  యూపీ వారియర్స్ బ్యాటింగ్ కు రానుంది.

ప్లేఆఫ్స్ కు ముందు ఇరు జట్లకూ ఇది ప్రాక్టీస్ మ్యాచ్ వంటిదే. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ లో  ఢిల్లీ తో  పాటు  ముంబై, యూపీలు ప్లేఆఫ్స్ కు చేరిన విషయం తెలిసిందే. అయితే  కొద్దిసేపటి క్రితమే ముంబై - ఆర్సీబీ మధ్య జరిగిన మ్యాచ్ లో   ముంబై.. లక్ష్యాన్ని  నిర్ణీత సమయంలో ఛేదించకపోవడంతో  ఢిల్లీ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. 

అయితే  నేటి మ్యాచ్ లో  ఢిల్లీని యూపీ భారీ తేడాతో ఓడిస్తే మాత్రం అది ఢిల్లీ అగ్రపీఠానికి  ముప్పు వాటిల్లుతుంది. ఈ లీగ్ నిబంధనల ప్రకారం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు నేరుగా ఫైనల్ కు చేరుతుంది.  రెండు, మూడు స్థానాల్లో ఉన్న  జట్లు ఎలిమినేటర్ ఆడతాయి.  ఎటువంటి సంచలనాలకు తావివ్వకుండా   నేరుగా ఫైనల్ ఆడాలంటే ఢిల్లీ.. తమ చివరి లీగ్ మ్యాచ్ లో కూడా దూకుడుగా ఆడితే  ఫైనల్ ఆడినట్టే. లేకుంటే మాత్రం షాక్ తప్పదు. 

బ్రబోర్న్ స్టేడియం వేదికగా  జరుగుతున్న నేటి మ్యాచ్ లో  కూడా గత మ్యాచ్ లో ముంబైపై దూకుడుగా ఆడినట్టే ఆడాలని   మెగ్ లానింగ్ సేన   భావిస్తున్నది.  ఈ లీగ్ లో  ఢిల్లీ ఇదివరకే ఏడు మ్యాచ్ లు ఆడి ఐదు మ్యాచ్ లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.  

తుది జట్లు :   ఈ మ్యాచ్ కోసం ఢిల్లీ జట్టు గత మ్యాచ్ లో బరిలోకి దిగిన జట్టుతోనే  ఆడుతుండగా యూపీ మాత్రం మూడు మార్పులు చేసింది. దేవికా, హరీస్, రాజేశ్వరి గైక్వాడ్  లు ఈ మ్యాచ్ ఆడటం లేదు.  వారి స్థానాల్లో  యశశ్రీ,  శ్వేతా  సెహ్రావత్ ,  షబ్నమ్ ఇస్మాయిల్ లు ఆడుతున్నారు. 

 

యూపీ వారియర్స్ :  అలీస్సా హేలీ (కెప్టెన్), శ్వేతా సెహ్రావత్,   కిరణ్ నవ్‌గిరె,  తహిలా మెక్‌గ్రాత్, యశశ్రీ, దీప్తి శర్మ, సోఫీ ఎకిల్‌స్టోన్,  సిమ్రాన్ షేక్, పర్శవి చోప్రా, అంజలి శర్వణి,  షబ్నమ్ ఇస్మాయిల్ 

ఢిల్లీ క్యాపిటల్స్ : మెగ్ లానింగ్ (కెప్టెన్), షఫాలీ వర్మ, అలీస్ క్యాప్సీ,  జెమీమా రోడ్రిగ్స్, మరిజనె కాప్, తానియా భాటియా, జెస్ జొనాసేన్, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి,  శిఖా  పాండే,   పూనమ్ యాదవ్ 

 

Follow Us:
Download App:
  • android
  • ios