న్యూఢిల్లీ: స్టీవ్ స్మిత్‌, వార్నర్‌లతో సహా ప్రపంచ కప్ జట్టుకుఎంపికైన ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఈ నెలాఖరులో ఐపీఎల్‌ను వీడనున్నారు. మే 2 నుంచి స్వదేశంలో జరిగే జట్టు శిక్షణ శిబిరంలో వీరంతా పాల్గొనాల్సి ఉంది.  డేవిడ్ వార్నర్ అందుబాటులో లేకపోతే సన్ రైజర్స్ హైదరాబాదుకు పెద్ద దెబ్బనే తగలనుంది. బ్యాటింగ్ లో హైదరాబాద్ చతికలబడే అవకాశం ఉంది. 

సన్‌రైజర్స్‌కు వార్నర్‌, రాజస్థాన్‌ రాయల్స్ కు స్మిత్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. మే 2 కన్నా ముందు సన్‌రైజర్స్‌ ఆడే ఐదు లీగ్‌ మ్యాచ్‌లకే వార్నర్‌ అందుబాటులో ఉంటాడు. స్మిత్‌ ఏప్రిల్‌ 30న చివరిగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగే మ్యాచ్‌ ఆడుతాడు

అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నుంచి స్టొయినిస్‌, ముంబై నుంచి బెహ్రెన్‌డార్ఫ్‌ కూడా ఐపిఎల్ లీగ్‌ను వదిలివెళ్లనున్నారు.