టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పుట్టిన రోజు సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. అతడు దాదాకు వెరైటీగా ట్విట్టర్ ద్వారా తెలియజేసిన శుభాకాంక్షలు క్రికెట్ ప్రియులనే కాదు  నెటిజన్లను కూడా ఎంతోగానో ఆకట్టుకుంటున్నాయి.   

సౌరవ్ గంగూలీ... భారత జట్టును కొన్నేళ్లపాటు విజయపథంలో నడిపిన అత్యుత్తమ సారథి. అతడి కెప్టెన్సీలోనే టీమిండియా విదేశాల్లో ఎలా ఆడాలి... సమిష్టిగా ఆడి ఎలా ఆడి గెలవాలి అన్న విషయాలను నేర్చుకుందంటే అందులో అతిశయోక్తి లేదు. గంగూలీ ఆట పట్ల ప్యాషన్ గా వుండేవాడో ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో చొక్కావిప్పి సంబరాలు చేసుకున్నపుడే అందరికీ అర్థమయ్యింది. భారత క్రికెట్ ఈ స్థాయిలో నిలిచిందంటే అందులో గంగూలీ పాత్ర చాలా వుంది. అలా భారత క్రికెట్ కు ఎన్న మరుపురాని విజయాలు అందించి విశేష సేవలు చేసిన ఈ బెంగాలీ దాదా ఇవాళ 48వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు.

ఇవాళ(జూలై 8వ తేదీన) 48వ పుట్టినరోజు జరుపుకుంటున్న మాజీ టీమిండియా సారథి గంగూలీ సహచరులు, వివిధ రంగాల ప్రముఖుల నుండి విషెస్ అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే అతడి సహచరుడు, ఒకప్పటి టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. అయితే అందరిలా మామూలుగా కాకుండా కాస్త వెరైటీగా దాదాకు విషెస్ చెప్పాడు. ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో గంగూలీ చొక్కావిప్పి సంబరాలు జరుపుకున్న సంఘటనను గుర్తుచేసేలా సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ క్రికెట్ ప్రియులనే కాదు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. 

'' పుట్టిన రోజు శుభాకాంక్షలు 56” కెప్టెన్ దాదా(గంగూలీ). 56 ఇంచుల చెస్ట్, 7వ నెలలో ఎనిమిదవ తేదీ అంటే 8*7=56. అలాగే ప్రపంచ కప్ మొత్తంలో మీ యావరేజ్ 56. '' అంటూ వెరైటీగా శుభాకాంక్షలు తెలిపాడు. చివర్లో నిన్ను ఆ దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను అంటూ సెహ్వాగ్ ట్వీట్ ను ముగించాడు. 

ఈ ట్వీట్ కు గంగూలీ లార్డ్ లో చొక్కా విప్పి సంబరాలు చేసుకున్న పోటోను జతచేశాడు. అంతేకాకుండా ప్రపంచ కప్ లో దాదాగణాంకాల సూచించే పట్టికను కూడా జతచేశాడు. ఇలా 47 సంవత్సరాలను పూర్తి చేసుకుని 48 వసంతంలోకి అడుగుపెడుతున్న కలకత్తా యువరాజు గంగూలీకి సెహ్వాగ్ శుభాకాంక్షలు తెలియజేశాడు.

Scroll to load tweet…