ఇంగ్లాండ్‌లో వచ్చే నెల చివరినుండి ప్రారంభం కానున్న వరల్డ్ కప్ మొగా టోర్నీ కోసం శ్రీలంక తమ జట్టును ప్రకటించింది. ప్రపంచ కప్ జట్టు ఎంపికలో లంక సెలెక్టర్లు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పటికే శ్రీలంక స్టార్ బౌలర్ లసిత్ మలింగను జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పించగా ఆ స్థానంలో  దిముత్‌ కరుణరత్నేను ఎంపిక చేశారు. దీంతో వరల్డ్ కప్ లో తలపడే శ్రీలంక జట్టును కరుణరత్నే ముందుండి నడిపించనున్నాడు.

అయితే లంక క్రికెట్ బోర్డు మలింగకు జట్టులో మాత్రం చోటు కల్పించింది. సెలెక్టర్లు ఎంపికచేసిన పదిహేను మంది ఆటగాళ్లలో ఎంజెలో మాథ్యూస్ చోటు దక్కించుకోగా ఫామ్ లేమితో సతమతమవుతున్న చండిమల్ మాత్రం దక్కించుకోలేకపోయాడు.  

శ్రీలంక వరల్డ్‌కప్‌ జట్టు ఇదే.. 

బ్యాట్ మెన్స్: 
 
దిముత్‌ కరుణరత్నే(కెప్టెన్‌), అవిష్కా ఫెర్నాండో, లహిరు తిరుమన్నే, కుశాల్‌ మెండిస్‌

బౌలర్లు:
జెఫ్రీ వాండర్సే, నువాన్‌ ప్రదీప్‌, లసిత్‌ మలింగా, సురంగా లక్మల్‌ 

ఆల్ రౌండర్లు:

ఏంజెలో మాథ్యూస్‌,ధనుంజయ డిసిల్వ, తిషారా పెరీరా, ఇసురు ఉదానా, జీవన్‌ మెండిస్‌, మిలింద్‌ సిరివర్దనా

వికెట్ కీపర్: 

కుశాల్‌ పెరీరా  

స్టాండ్‌బై ఆటగాళ్లు:

ఒషాదా ఫెర్నాండో, కసున్‌ రజితా, హసరంగా, ఏంజెలో పెరీరా