వచ్చే నెల మే లో ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ కోసం క్రికెట్ తో సంబంధమున్న ప్రపంచ దేశాలన్ని సిద్దమవుతున్నాయి. ఇప్పటికే ఇండియాతో పాటు పలు దేశాలు ప్రపంచ కప్ లో పాల్గొనే తమ జట్లను ప్రకటించాయి. ఇలా ఆటగాళ్ల ఎంపికను చేపట్టి ప్రపంచ కప్ సన్నద్దంలో తాము ముందున్నామనే సంకేతాలను ఇతన జట్లకు పంపించారు. ఈ క్రమంలోనే మన దాయాది పాకిస్థాన్ కూడా ప్రపంచ కప్ లో పాల్గొనే జట్టును గురువారం ప్రకటించింది. 

ప్రపంచ కప్ జట్టు ఎంపికలో పాక్ సెలెక్టర్లు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. పాక్ స్టార్ బౌలర్ మహ్మద్ అమీర్ కు ప్రపంచ కప్ జట్టులో చోటు కల్పించకుండా మొండిచేయి చూపించారు. కానీ అంతకు ముందు ఇంగ్లాండ్ తో జరగనున్న సీరిస్ కు మాత్రం ఎంపిక చేశారు. ఇదే విదంగా పాక్ జట్టులో మంచి హిట్టర్ గా పేరుతెచ్చుకున్న ఆసిఫ్ అలీకి కూడా ప్రపంచ కప్ టోర్నీలో ఆడే అవకాశం లభించలేదు. అతన్ని కూడా కేవలం ఇంగ్లాండ్ సీరిస్ కే పరిమితం చేశారు. 

  పాకిస్థాన్ ప్రపంచ కప్ 2019 జట్టును ఓసారి పరిశీలిస్తే 2015 లో ఆడిన కేవలం ముగ్గురు ఆటగాళ్ల మాత్రమే ఈ జట్టులో కనిపిస్తారు. అప్పుడు కేవలం వికెట్ కీఫర్ గా మాత్రమే ఆడిన సర్పరాజ్ అహ్మద్ నాలుగేళ్లు ముగిసేసరిని కెప్టెన్ కమ్ వికెట్ కీపర్ గా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఇతడితో పాటు హరీస్ సోహెల్, మహ్మద్ హఫీజ్ లు మాత్రమే 2015 జట్టులో ఆడిన సభ్యులు. మిగతా జట్టు సభ్యులంతా కొత్తవారే.  

యువ బౌలర్ హస్నన్ ను అతడి బౌలింగ్ లో స్పీడ్ వైవిద్యం కారణంగానే ఎంపిక చేసినట్లు పాకిస్ధాన్  సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ ఇంజమామ్ ఉల్ హక్ వెల్లడించాడు. అంతడు ఎక్కువ వన్డేలు ఆడకపోవచ్చు కానీ ఆడిన వాటిలోనే తన ప్రతిభన నిరూపించుకున్నాడని ప్రశంసించాడు. సీనియర్ బ్యాట్ మెన్స్ ని సైతం బోల్తా కొట్టించే సత్తా అతడిలో వుందన్నాడు. అంతేకాకుండా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే షోయబ్ మాలిక్, హఫీజ్ ల ఎంపిక చేసినట్లు ఇంజమామ్ వెల్లడించాడు. 

పాక్ ప్రపంచ కప్ జట్టిదే... 

సర్ఫరాజ్ అహ్మద్(కెప్టెన్), ఫఖార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్, అబిద్ అలీ, హరీస్ సోహెల్, షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్, ఫహీమ్ అశ్రఫ్, ఇమద్ వసీమ్, షాదబ్ ఖాన్, మహ్మద్ హస్‌నైన్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, జునైద్ ఖాన్