Asianet News TeluguAsianet News Telugu

ప్రపంచ కప్ 2019: ఆందోళనలో కోహ్లీసేన...నేడే బంగ్లాతో వార్మప్ మ్యాచ్

ఐసిసి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ కప్ 2019 టోర్నీ ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే టీమిండియాతో పాటు అంతర్జాతీయ జట్లన్నీ ఇంగ్లాండ్ కు చేరుకున్నాయి. ఈ క్రమంలో ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో టీమిండియా బ్యాట్ మెన్స్ విఫలమవడంతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. టైటిల్ పేవరెట్ గా బరిలోకి దిగిన భారత్ ఇలా ఓటమితో ప్రపంచ కప్ ప్రారంభించడం అభిమానులను నిరాశపర్చింది. దీంతో ఇవాళ(మంగళవారం) బంగ్లాదేశ్ తో జరిగే వార్మప్ మ్యాచ్ లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి అభిమానుల ప్రశంసలు పొందడంతో పాటు కాన్ఫిడెంట్ తో ముందుకు సాగాలని టీమిండియా భావిస్తోంది. 

world cup 2019: india vs bangladesh warm up match
Author
Cardiff, First Published May 28, 2019, 1:57 PM IST

ఐసిసి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ కప్ 2019 టోర్నీ ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న విషయం తెలిసిందే. మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే టీమిండియాతో పాటు అంతర్జాతీయ జట్లన్నీ ఇంగ్లాండ్ కు చేరుకున్నాయి. ఈ క్రమంలో ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ లో టీమిండియా బ్యాట్ మెన్స్ విఫలమవడంతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. టైటిల్ పేవరెట్ గా బరిలోకి దిగిన భారత్ ఇలా ఓటమితో ప్రపంచ కప్ ప్రారంభించడం అభిమానులను నిరాశపర్చింది. దీంతో ఇవాళ(మంగళవారం) బంగ్లాదేశ్ తో జరిగే వార్మప్ మ్యాచ్ లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి అభిమానుల ప్రశంసలు పొందడంతో పాటు కాన్ఫిడెంట్ తో ముందుకు సాగాలని టీమిండియా భావిస్తోంది. 

భారత జట్టుకు మొదటినుండి ప్రధాన బలమంతా బ్యాటింగ్ దే. హేమాహేమీలైన బ్యాట్ మెన్స్ జట్టులో వుండటంతో న్యూజిలాండ్ మ్యాచ్ లో భారీ పరుగుల వరద పారుతుందని అందరు భావించారు. అయితే అందుకు భిన్నంగా భారత టాప్ ఆర్డర్ విఫలమవడంతో పాటు మిడిల్ ఆర్డర్ చేతులెత్తేయడంతో అతి తక్కువ పరుగులకే(179) ఆలౌట్ అవ్వాల్సి వచ్చింది. దీంతో న్యూజిలాండ్ సునాయాసంగా లక్ష్యాన్ని చేధించి విజయాన్ని అందుకుంది. 

ఈ మ్యాచ్ తర్వాత బ్యాటింగ్ లైనప్ పై  కోహ్లీ సేనలో ఆందోళన నెలకొంది. సీనియర్లతో కూడిన టాప్ ఆర్డర్ తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా విఫలమవడంతో గతంలో జట్టుపై వున్న నమ్మకం కాస్త సన్నగిల్లింది. దీంతో బంగ్లాతో జరగనున్న చివరి వార్మప్ మ్యాచ్ లో అయినా రాణించి కాన్పిడెంట్ తో ప్రపంచ కప్ లీగ్ లోకి అడుగుపెట్టాలని భారత జట్టు భావిస్తోంది. దీంతో నేడు భారత్-బంగ్లాల మధ్య జరగనున్న వార్మప్ మ్యాచ్ పై ఆసక్తి నెలకొంది.  
 
న్యూజిలాండ్ తో జరిగిన మొదటి వార్మప్ మ్యాచ్ లో ఆల్ రౌండర్లు విజయ్ శంకర్, కేదార్ జాదవ్ లు దూరమయ్యారు. దీంతో మిడిల్ ఆర్డర్ బలహీనంగా కనిపించింది. అయితే ఇవాళ జరగనున్న మ్యాచ్ కు వారిద్దరు ఆడతారో లేదో ఇంకా స్పష్టత రాలేదు. వీరిద్దరు గనక ఈ మ్యాచ్  లో అందుబాటులోకి వస్తే టీమిండియా మిడిల్ ఆర్డర్ కాస్త బలంగా మారనుంది. మొత్తానికి బంగ్లాదేశ్ తో జరగనున్న ఈ వార్మప్ మ్యాచ్ లో సమిష్టిగా రాణించి విజయాన్ని అందుకోవాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios