Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాదీ క్రికెటర్లకే ఎందుకీ విచిత్ర పరిస్థితి: రాయుడికి ఓజా మద్దతు

ప్రపంచ కప్ జట్టు కోసం జరిగిన ఆటగాళ్ళ ఎంపికలో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడికి సెలెక్టర్లు మొండిచేయి చూపించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన వన్డే మ్యాచుల ద్వారా అంబటి రాయుడు మంచి ఫామ్‌లోకి వచ్చాడు. అంతేకాకుండా టీమిండియాకు సమస్యగా మారిన నాలుగో స్ధానం, మిడిల్ ఆర్డర్ లో చక్కగా రాణిస్తున్నాడు. అయినప్పటికి అతన్ని పక్కన పెట్టి పేలవ ఆటతీరుతో గతంలో అభిమానులు, మాజీల విమర్శలకు గురైన విజయ్ శంకర్ కి వరల్డ్ కప్ కోసం ఎంపిక చేశాడు. ఇలా ఓ తెలుగోడు సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ గా వున్నపుడే తెలుగు క్రికెటర్ కు అన్యాయం జరగడాన్ని ఇరు  తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు సహించలేకపోతున్నారు. కేవలం అభిమానులే కాదు మాజీ తెలుగు క్రికెటర్లు కూడా సెలెక్టర్ల తీరును వ్యతిరేకిస్తున్నారు. 

World Cup 2019: hyderabadi spinner pragyan ojha reacts on ambati rayudu issue
Author
Hyderabad, First Published Apr 19, 2019, 6:18 PM IST

ప్రపంచ కప్ జట్టు కోసం జరిగిన ఆటగాళ్ళ ఎంపికలో తెలుగు క్రికెటర్ అంబటి రాయుడికి సెలెక్టర్లు మొండిచేయి చూపించిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన వన్డే మ్యాచుల ద్వారా అంబటి రాయుడు మంచి ఫామ్‌లోకి వచ్చాడు. అంతేకాకుండా టీమిండియాకు సమస్యగా మారిన నాలుగో స్ధానం, మిడిల్ ఆర్డర్ లో చక్కగా రాణిస్తున్నాడు. అయినప్పటికి అతన్ని పక్కన పెట్టి పేలవ ఆటతీరుతో గతంలో అభిమానులు, మాజీల విమర్శలకు గురైన విజయ్ శంకర్ కి వరల్డ్ కప్ కోసం ఎంపిక చేశాడు. ఇలా ఓ తెలుగోడు సెలెక్షన్ కమిటీ ఛైర్మన్ గా వున్నపుడే తెలుగు క్రికెటర్ కు అన్యాయం జరగడాన్ని ఇరు  తెలుగు రాష్ట్రాల క్రికెట్ అభిమానులు సహించలేకపోతున్నారు. కేవలం అభిమానులే కాదు మాజీ తెలుగు క్రికెటర్లు కూడా సెలెక్టర్ల తీరును వ్యతిరేకిస్తున్నారు. 

హైదరబాదీ క్రికెటర్‌ అంబటి రాయుడిని వన్డే ప్రపంచ కప్ కి ఎంపిక చేయకపోవడంపై మరో హైదరాబాద్‌ క్రికెటర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా స్పందించాడు. ఇటీవల రాయుడు టీమిండియా చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ పై వ్యంగ్యంగా ఓ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈసారి త్రీడి కళ్లద్దాలతో ప్రపంచ కప్ మ్యాచులు చూస్తానంటూ ట్వీట్ చేసి విజయ్ శంకర్ ని త్రీడైమెన్షన్ ప్లేయర్ గా అభివర్ణించిన ఎమ్మెస్కేకు చురకలు అంటించాడు. 

ఈ ట్వీట్ పై తాజాగా ప్రజ్ఞాన్ ఓజా స్పందించాడు. ‘హైదరాబాదీ క్రికెటర్లకే ఇలాంటి విచిత్ర పరిస్థితులు ఎదురవుతాయి. ఇలాంటి పరిస్థితులు నేను ఎదుర్కున్నా. నీ బాధను అర్థం చేసుకోగలను’ అని రాయుడికి మద్దతు తెలుపుతూ ఓజా ట్వీట్‌ చేశాడు. ఓజాను కూడా అర్థాంతరంగా భారత జట్టులోంచి తొలగించారు. దీంతో ఆ ఆవేదనను అతడు ఈ ట్వీట్ ద్వారా బయటపెడుతూ హైదరాబాది క్రికెటర్ల పరిస్థితిని వివరించాడు. 

రాయుడు విషయానికి వస్తే...ప్రస్తుతం వన్డే యావరేజ్ విషయంలో రాయుడు టీమిండియాలో టాప్ ఆటగాళ్ల సరసన నిలిచాడు. టీమిండియా  కెప్టెన్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ధోని, వైస్ కెప్టెన్ రోహిత్ తర్వాత నాలుగో అత్యధిక యావరేజ్ కలిగిన ఆటగాడు రాయుడే. అతడి వన్డే బ్యాటింగ్ యావరేజ్ 47.5 గా వుంది. అయినప్పటికి అతడి కంటే  తక్కువ యావరేజ్ 42.18 కలిగి, నాలుగో స్థానంలో రాణించలేకపోయిన విజయ్ శంకర్ కి ప్రపంచ  కప్ జట్టులో స్థానం కల్పించడం అభిమానుల ఆగ్రహానికి కారణమవుతోంది. 

టీమిండియా సెలెక్షన్ కమిటీ చీఫ్ గా ఓ తెలుగోడే వున్నప్పటికి తెలుగు క్రికెటర్ అంబటి రాయుడికి అన్యాయం జరుగుతుంటే ఏం చేశాడని అభిమానులు ఇదివరకేప్రశ్నిస్తున్నారు. అతడిపైనే కాకుండా సెలెక్షన్ కమిటీలోని మిగతా సభ్యులపై కూడా తెలుగు అభిమానులు విరుచుకుపడుతున్నారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios