WPL Auction 2023: రూ.2.6 కోట్లకు యూపీ వారియర్స్ జట్టులోకి దీప్తి శర్మ... రూ.3 కోట్ల 20 లక్షలకు నటాలీ స్కివర్‌ని కొనుగోలు చేసిన ముంబై ఇండియన్స్ జట్టు...

భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మను కొనుగోలు చేయడానికి ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు పోటీపడ్డాయి. రూ.2.6 కోట్లకు దీప్తి శర్మను యూపీ వారియర్స్ జట్టు కొనుగోలు చేసింది.

భారత స్టార్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్‌ని కొనుగోలు చేయడానికి ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడ్డాయి. రూ.1 కోటి 50 లక్షలకు ఆర్‌సీబీ, రేణుకా సింగ్‌ని దక్కించుకుంది... 

టీమిండియా యంగ్ సెన్సేషన్ షెఫాలీ వర్మను కొనుగోలు చేయడానికి ఆర్‌సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్ హోరాహోరీన పోటీపడ్డాయి. షెఫాలీ వర్మను రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

ఇంగ్లాండ్ ఓపెనర్ టమ్మీ బేమోంట్, సౌతాఫ్రికా ఓపెనర్ లోరా వాల్వారెట్, తజ్మీన్ బ్రిట్స్, న్యూజిలాండ్ ఓపెనర్ సూజీ బేట్స్ అమ్ముడుపోని ప్లేయర్ల జాబితాలో చేరిపోయారు..

ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ నటాలీ స్కివర్‌ని కొనుగోలు చేయడానికి ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ జట్లు పోటీపడ్డాయి. రూ.3 కోట్ల 20 లక్షలకు నటాలీ స్కివర్‌ని ముంబై ఇండియన్స్ జట్టు సొంతం చేసుకుంది.. 

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ తహ్‌లియా మెక్‌గ్రాత్‌ని కొనుగోలు చేయడానికి ఆర్‌సీబీ, గుజరాత్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ జట్లు పోటీపడ్డాయి. రూ.1 కోటి 40 లక్షలకు తహ్‌లియా మెక్‌గ్రాత్‌ని కొనుగోలు చేసింది యూపీ వారియర్స్..

ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బెత్ మూనీని ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు పోటీపడ్డాయి. బెత్ మూనీని రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది గుజరాత్ వారియర్స్...

సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ షబ్‌నమ్ ఇస్మాయిల్‌ని కొనుగోలు చేయడానికి ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ జట్లు పోటీపడ్డాయి. రూ.1 కోటికి యూపీ వారియర్స్ జట్లు, షబ్నమ్ ఇస్మాయిల్‌ని దక్కించుకుంది...

న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమీలియా కౌర్‌ని ముంబై ఇండియన్స్ జట్టు 1 కోటి రూపాయలకు దక్కించుకుంది. ఇంగ్లాండ్ బ్యాటర్ సోఫియా డంక్లీని కొనుగోలు చేయడానికి ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ పోటీపడ్డాయి. రూ.60 లక్షలకు గుజరాత్ జెయింట్స్‌ జట్టు, సోఫియాని దక్కించుకుంది...

టీమిండియా యంగ్ డైనమేట్ జెమీమా రోడ్రిగ్స్‌ని కొనుగోలు చేయడానికి యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు పోటీపడ్డాయి. రూ.2 కోట్ల 20 లక్షలకు జెమీమా రోడ్రిగ్స్‌ని కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్...

న్యూజిలాండ్ బ్యాటర్ సూజీ బేట్స్ అమ్ముడుపోని ప్లేయర్ల జాబితాలో చేరిపోయింది. ఆస్ట్రేలియా టీమ్ కెప్టెన్ మెగ్ లానింగ్‌ని రూ.1 కోటి 10 లక్షలకు కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్.. 


స్మృతి మంధాన పేరు వినగానే ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు హోరాహోరీగా పోటీపడ్డాయి. కేవలం కొన్ని క్షణాల్లోనే రూ.50 లక్షల నుంచి రూ.3 కోట్లకు చేరుకుంది స్మృతి మంధాన..

రూ.3 కోట్ల 40 లక్షలకు టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధానని కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. స్మృతి మంధాన తర్వాత వేలానికి వచ్చిన టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ని కొనుగోలు చేయడానికి ఆర్‌సీబీతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, యూపీ వారియర్స్ జట్లు పోటీపడ్డాయి...

హర్మన్‌ప్రీత్ కౌర్‌ని రూ.1 కోటి 80 లక్షలకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్ జట్టు. సోఫీ డివైన్‌ని కొనుగోలు చేయడానికి పెద్దగా పోటీ జరగలేదు. బేస్ ప్రైజ్ రూ.50 లక్షలకు సోఫీ డివైన్‌ని దక్కించుకుంది ఆర్‌సీబీ...


హేలీ మాథ్యూస్‌ని కొనుగోలు చేయడానికి ఏ జట్టూ ఆసక్తి చూపించలేదు. ఆస్ట్రేలియా ప్లేయర్ యాష్లీ గార్డనర్‌ని కొనుగోలు చేయడానికి యూపీ వారియర్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ జట్లు పోటీపడ్డాయి. గుజరాత్ జెయింట్స్ రూ.3 కోట్ల 20 లక్షలకు యాష్లీ గార్డనర్‌ని కొనుగోలు చేసింది..

ఆసీస్ స్టార్ ఎలీసా పెర్రీని కొనుగోలు చేయడానికి ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు పోటీపడ్డాయి. రూ.1 కోటి 70 లక్షలకు ఆర్‌సీబీ జట్టు, పెర్రీని దక్కించుకుంది. 

ఇంగ్లాండ్ ప్లేయర్ సోఫీ ఎక్లెస్టోన్‌ని కొనుగోలు చేయడానికి ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీపడ్డాయి. యూపీ వారియర్స్ రూ.1 కోటి 80 లక్షలకు సోఫీ ఎక్లెస్టోన్‌కి దక్కించుకుంది.