బంగ్లాదేశ్ వుమెన్స్ ముందు 160 పరుగుల లక్ష్యం... స్మృతి మంధాన, షెఫాలీ వర్మ రికార్డు ఫీట్... కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌కి రెస్ట్...
మెన్స్ ఆసియా కప్ 2022 టోర్నీలో పాక్ చేతుల్లో ఎదురైన పరాభవం మరవకముందే వుమెన్స్ ఆసియా కప్ 2022 టోర్నీలోనూ అదే అనుభవం ఎదురైంది భారత జట్టు. పాక్ చేతుల్లో ఓడిన భారత మహిళా జట్టు, నేడు బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ఆడుతోంది...
బంగ్లా వుమెన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 159 పరుగుల స్కోరు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్‌కి విశ్రాంతి కల్పించడంతో నేటి మ్యాచ్‌కి స్మృతి మంధాన కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది...
తొలి వికెట్‌కి భారత ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ కలిసి 96 పరుగుల భాగస్వామ్యం అందించారు... టీ20ల్లో స్మృతి మంధాన, షెఫాలీ వర్మ మధ్య ఇది 10వ 50+ భాగస్వామ్యం. టీమిండియా తరుపున ఈ ఫీట్ సాధించిన మొట్టమొదటి టీ20 ఓపెనింగ్ జోడీగా నిలిచారు షెఫాలీ, స్మృతి మంధాన...
40 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్న షెఫాలీ వర్మ, అతి పిన్న వయసులో టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసింది. షెఫాలీ వర్మ వయసు ప్రస్తుతం 18 ఏళ్ల 253 రోజులు. ఇంతకుముందు 21 ఏళ్ల 32 రోజుల వయసులో భారత యంగ్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ ఈ ఫీట్ సాధించింది.
38 బంతుల్లో 6 ఫోర్లతో 47 పరుగులు చేసిన స్మృతి మంధాన రనౌట్ కాగా 44 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేసిన షెఫాలీ వర్మను రుమాన అహ్మద్ క్లీన్ బౌల్డ్ చేసింది...
7 బంతుల్లో 4 పరుగులు చేసిన రిచా ఘోష్ నిరాశపరచగా ఆ తర్వాతి బంతికే కిరణ్ నవ్‌గిరే గోల్డెన్ డకౌట్ అయ్యింది. దీప్తి శర్మ 5 బంతుల్లో ఓ సిక్సర్‌తో 10 పరుగులు చేసి ఆఖరి ఓవర్‌లో అవుట్ కాగా బీభత్సమైన ఫామ్‌లో ఉన్న యంగ్ ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ 24 బంతుల్లో 4 ఫోర్లతో 35 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచింది... ఈ ఆసియా కప్ టోర్నీలో జెమీమా రోడ్రిగ్స్‌కి ఇది మూడో 35+ స్కోరు.
శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 53 బంతుల్లో 76 పరుగులు చేసిన జెమీమా రోడ్రిగ్స్, ఆ తర్వాత యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 45 బంతుల్లో 75 పరుగులు చేసింది. మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో బ్యాటింగ్‌కి రాని జెమీమా రోడ్రిగ్స్, పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చి 8 బంతులాడి 2 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచింది.
